ఆ సినిమా తరువాతే మహేశ్ కి ఛాన్స్

Mon Apr 22 2019 20:00:01 GMT+0530 (IST)

Mahesh Babu Commitment with Anil Ravipudi

తీసిన నాలుగు సినిమాలు కమర్శీయల్ సక్సెస్ లు అందుకోవడంతో - అనిల్ రావిపూడి రేంజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడికో వెళ్లిపోయింది. మనోడు దగ్గరు కథలు రెడీగా లేకపోయినా అడ్వాన్స్ లు ఇచ్చేసి మరీ లాక్ చేసుకోవడానికి కొందరు నిర్మాతలు తహతహలాడుతున్నారు. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రం కాస్త ముందుగానే అనిల్ రావిపూడి టాలెంట్ గుర్తించాడు. ఎఫ్ 2 షూటింగ్ లో ఉండగానే - అనిల్ ని పిలిపించుకొని ఓ కథ రెడీ చేయమని అడిగాడట - దీనికి అనిల్ సైతం వెంటనే స్పందించి ఎఫ్ 2 షూటింగ్ కి మధ్యలో ఓ 10 రోజులు బ్రేక్ చెప్పి వైజాగ్ లో స్టోరీ సిట్టింగ్ వేసీ - ఓ మాస్ మసలా కథని రెడీ చేసాడని తెలిసింది.ఈ కథ మహేశ్ కి సైతం నచ్చడంతో త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా పట్టాలెక్కేందుకు లైన్ క్లియర్ అయింది. అయితే ఇదంతా మూడో కంటికి తెలియకుండా చాలా సైలెంట్ గా జరిగిడంతో మహేశ్ - అనిల్ రావిపూడి సినిమా పై ఓ క్లారిటీ ఇంతవరుకు ఎవ్వరి దగ్గరలేదు. అయితే ఎఫ్ 2 విడుదలైన తరువాత ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. గురు తరహాలో ఈ సినిమా ఉంటుందని - ఈ సినిమా తరువాతే మహేశ్ బాబుతో సినిమా ఉంటుందని ఓ టాక్ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తుంది. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు మహేశ్ సైతం అనిల్ కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా తనతో సినిమా చేసుకునే కమిట్మెంట్ అనిల్ రావిపూడికి మహేశ్ బాబు ఇచ్చాడని తెలిసింది. ఇది అలా ఉంచితే మహేశ్ బాబు పిలిచి సినిమా చేయమని ఛాన్స్ ఇస్తే - అది వదిలేసి ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని అనిల్ రావుపూడి ఎందకు ఎత్తుకున్నాడో అంటూ మనోడి పై కామెంట్స్ పడుతున్నాయ్...