Begin typing your search above and press return to search.

హిందీ మార్కెట్ కోస‌మేనా ఈ వేలం వెర్రి?

By:  Tupaki Desk   |   10 Aug 2020 4:00 AM GMT
హిందీ మార్కెట్ కోస‌మేనా ఈ వేలం వెర్రి?
X
పాన్ ఇండియా మార్కెట్ మ‌న హీరోల‌పై తీవ్ర‌మైన ఒత్తిడి పెంచుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ముఖ్యంగా బాహుబ‌లి ఫ్రాంచైజీతో ప్రభాస్ రేంజ్ అమాంతం స్కైని ట‌చ్ చేయ‌డంతో ఇత‌ర తెలుగు హీరోల్లో పోటీత‌త్వం పెరిగింది. ప్ర‌భాస్ బాట‌లో వెళ్లాల‌న్న పంతంతో ఉన్నారు అంతా. ఆ మేర‌కు హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. కానీ ఇదంతా ఒక్క‌సారిగా కుదిరేప‌నేనా? అంద‌రికీ ప్ర‌భాస్ కి కుదిరిన‌ట్టు కుదురుతుందంటారా?

కార‌ణం ఏదైనా మ‌న స్టార్ హీరోలు ఎందులోనూ త‌గ్గ‌డం లేదు. ఇటీవ‌ల స్టార్లు హీరోలు యూట్యూబ్.. సోష‌ల్ మీడియాల్లో చేస్తున్న హ‌డావుడి చూస్తుంటే ర‌క‌ర‌క‌లా సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు. త‌మ‌ను తాము ఇరుగు పొరుగు మార్కెట్ల‌లో ప్ర‌మోట్ చేసుకునేందుకు సోష‌ల్ మీడియా టీమ్ ల‌తో వీళ్లంతా ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డ‌ల్ని అనుస‌రిస్తున్నారు. అది అల్లు అర్జున్ అయినా లేక మహేష్ అయినా చ‌ర‌ణ్ అయినా ప్ర‌చారార్భాటానికి అతీతులు కాద‌ని అర్థ‌మ‌వుతోంది. వీళ్లంతా తెలుగు మార్కెట్లో బాగానే వెలుగుతున్నారు. రావాల్సిన దానికంటే టాలీవుడ్ లో మార్కెట్ బాగానే ఉంది. నేమ్‌ ఫేమ్ ఉన్నాయి. మరి ట్విట్టర్ లో వరల్డ్ రికార్డ్స్ కోసం ఈ స్థాయి పాకులాట ఏల‌‌? అన్న చ‌ర్చా సాగుతోంది.

ఇదంతా హిందీ వాళ్లు గుర్తించడం కోసమేనా..? అక్క‌డ మార్కెట్ పెంచుకునే ఎత్తుగ‌డేనా? బాహుబలి తరువాత ప్రభాస్ ఓ రేంజ్ కి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ల‌కు బాహుబలి లేదు కాబ్బట్టి ట్విట్టర్ లేదా సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ కి వచ్చిన మాదిరి పేరు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారా..? బర్త్ డే ట్రెండ్స్ అంటూ మహేష్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారంటూ ప్ర‌చార‌మైంది. ఇది నిజంగా వరల్డ్ రికార్డు ఐతే గిన్నిస్ బుక్ వాళ్ళు దగ్గర నుంచి ట్విట్టర్ వాళ్ళు వరకు అధికారికంగా ప్ర‌క‌టించాలిగా! ఏంటో ఈ వేలం వెర్రి అని పలువురు సినీ పెద్దలే కామెంట్లు చేస్తున్నారు.