Begin typing your search above and press return to search.

అల్ల‌రి వేషాల్లో సీతా పాప‌కు సాటి రారు

By:  Tupaki Desk   |   25 Jan 2020 5:56 AM GMT
అల్ల‌రి వేషాల్లో సీతా పాప‌కు సాటి రారు
X
ఓ వైపు సినిమాలు.. మ‌రో వైపు వ్యాపారాలు.. ఇంకో వైపు బ్రాండ్ ప్ర‌మోష‌న్ .. ఇంత బిజీలోనూ మ‌హేష్ ఫ్యామిలీకి టైమ్ ఎలా కేటాయించ‌గ‌లుగుతున్నారు? కుటుంబ స‌మేతం గా విదేశీ విహారాల్ని ఎలా ఆస్వాధించ‌గ‌లుగుతున్నారు? అంటే అత‌డు ఠ‌ఫ్ టాస్క్ మాస్టారేన‌ని అంగీక‌రించాలి. ప్ర‌తిదీ షెడ్యూల్ ప్ర‌కారం బ్యాలెన్స్ చేయ‌గ‌లిగితే కుటుంబ జీవ‌నం లో ఉన్నంత సౌంద‌ర్యం ఇక ఎందులోనూ ఉండ‌ద‌ని ఎంద‌రో ప్రూవ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ విష‌యం లో అంద‌రికీ ఆద‌ర్శం అని చెబుతారు.

న‌వ‌త‌రంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ దీనిని అనుస‌రిస్తున్నారు. బిజీ లైఫ్ ని షెడ్యూలింగ్ చేసి ప‌క్కాగా ఫ్యామిలీకి స‌మ‌యం కేటాయిస్తున్నారు. న‌మ్ర‌త‌- గౌత‌మ్ - సితార త్ర‌యానికి విదేశీ విహారాల‌కు కొద‌వేమీ లేకుండా చేస్తున్నారు. కెరీర్ బిజీలో అల‌సిసొలిసిన త‌న‌కు రిలీఫ్.. అలాగే ఫ్యామిలీ తో విలువైన స‌మ‌యం గ‌డిపిన తృప్తి రెండూ మిగులుతున్నాయి. ప్ర‌స్తుతం మ‌హేష్ అమెరికా విహారంలో ఉన్నారు. ఇప్ప‌టికే న్యూయార్క్ న‌గ‌రం లో సీతా పాప స‌హా అంద‌రి తో జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఆన్ లొకేష‌న్ నుంచి కొన్ని ఫోటోల్ని న‌మ్ర‌త తాజాగా త‌న ఇన్ స్టా ద్వారా షేర్ చేశారు. వీటిలో న‌మ్ర‌త అల్ట్రా మోడ్ర‌న్ లుక్ స‌హా గౌత‌మ్- సితార అల్ల‌రి వేషాల ఫోటో ఆక‌ట్టుకున్నాయి. వీట‌న్నిటినీ మించి సితార చిలిపి వేషం క‌డుపుబ్బా న‌వ్వించేస్తోంది. డాడ్ తో క‌లిసి న్యూయార్క్ వీధుల్లో విహ‌రిస్తున్న సీతా పాపా టాప్ టు బాట‌మ్ చ‌లికోట్ ని క‌ప్పేసుకుని షికార్ ని ఎంజాయ్ చేస్తోంది. ఆ లొకేష‌న్ ఏదో మాల్స్ -భారీ భ‌వంతులు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నాయి. ఆ బ్యాక్ గ్రౌండ్ లో ఏదో హాలీవుడ్ సినిమా పోస్ట‌ర్ క‌నిపిస్తోంది. మొత్తానికి సీతా పాప‌కు ఇది రియ‌ల్ లైవ్ ఎక్స్ పీరియెన్స్. త‌న‌తో ఇలా టైమ్ స్పెండ్ చేయ‌డాన్ని సూప‌ర్ స్టార్ అంతే ఆస్వాధిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. `స‌రిలేరు నీకెవ్వ‌రు` రిలీజ్ త‌ర్వాత రెండు నెల‌ల సుదీర్ఘ విరామాన్ని ఫ్యామిలీ తో ఇలా ప్లాన్ చేశార‌న్న‌మాట‌. ఈ వెకేష‌న్ పూర్త‌వ్వ‌గానే మ‌హ‌ర్షి ఫేం వంశీ పైడిప‌ల్లి తో మ‌హేష్ 27 సెట్స్ కెళ్ల‌నుంది.