మహేష్ తో ఉంటే నమ్రత ఏజ్ తెలిసిపోతోంది!

Sun Jun 26 2022 21:32:01 GMT+0530 (India Standard Time)

Mahesh Babu And Namrata Shirodkar

సూపర్ స్టార్ మహేష్ - నమ్రత జంట విదేశీ విహార యాత్రలు ప్రతిసారీ హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఏడాదికి కనీసం రెండు మూడు సార్లు ఈ జంట తమ పిల్లలు బంధుమిత్రులతో విదేశాల్లో సెలబ్రేషన్ ని ప్లాన్ చేస్తుంటారు. ఎంత బిజీ లైఫ్ ఉన్నా.. కుటుంబ జీవితంలో ఫ్లేవర్ మిస్ కానివ్వకుండా మహేష్ ఇలాంటి యాత్రలను ప్లాన్ చేస్తుంటారు. షూటింగ్ షెడ్యూళ్ల నడుమ కుటుంబ జీవితాన్ని గడిపేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మహేష్. టాలీవుడ్ లో పర్ఫెక్ట్ కపుల్ గా మహేష్- నమ్రత జంట అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు.ప్రస్తుతం నమ్రత- మహేష్ జంట న్యూయార్క్ నగరంలో విహారయాత్రను ఆస్వాధిస్తున్నారు. ఇక నిరంతరం విలాసవంతమైన భవంతులు ఆన్ రోడ్స్ స్పాట్ నుంచి ఈ జంట షేర్ చేస్తున్న ఫోటోగ్రాఫ్స్ అంతే వైరల్ గా మారుతున్నాయి. తాజాగా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ లో 47ఏళ్ల మహేష్ 25 సంవత్సరాల సుందరాంగుడిలా కనిపిస్తున్నారు. నిజానికి నమ్రత తనకంటే ఓల్డ్ గా కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మహేష్ తో ఉంటే నమ్రత ఏజ్ తెలిసిపోతోంది! అనేది యూత్ కామెంట్.

ఇకపోతే మహేష్ నటించిన సర్కార్ వారి పాట ఇటీవలే విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి దర్శకధీరుడు రాజమౌళితో భారీ పాన్ ఇండియా చిత్రానికి సన్నాహకాల్లో ఉన్నారు. దీనికోసం మహేష్ మునుపెన్నడూ లేని విధంగా భారీగా కాల్షీట్లను కేటాయించనున్నారు. దీనిపై అధికారిక  ప్రకటన వెలువడాల్సి ఉంది.