'ఆర్.ఆర్.ఆర్' బ్యానర్ లో 'మహేష్ - ప్రశాంత్' ప్రాజెక్ట్..?

Wed Jun 09 2021 13:00:28 GMT+0530 (IST)

Mahesh - Prashant project under RRR banner

సూపర్ స్టార్ మహేష్ బాబు - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ మూవీ రానుందని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్.. ఇప్పటికే మహేష్ తో ఓ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ చెప్పిన కథ నచ్చకపోవడంతో మహేష్ సున్నితంగా తిరస్కరించారట. కాకపోతే ప్రశాంత్ తో కలిసి వర్క్ చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేసిన మహేష్.. మరో కథతో రావాల్సిందిగా కోరాడట. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి ప్రాజెక్ట్స్ తో వాళ్ళు బిజీ అయిపోయారు.మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పారట' సినిమా చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హైట్రిక్ మూవీ అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలో రాజమౌళి తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' సినిమా తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ చేసిన ట్వీట్ తో మహేష్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మరోసారి చర్చల్లోకి వచ్చింది.

ప్రస్తుతం 'ఆర్.ఆర్ ఆర్' చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ దానయ్య.. ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారట. 'భరత్ అనే నేను' తర్వాత మహేష్ తో మరో సినిమాకి కమిట్మెంట్ ఉండటంతో.. వీరిద్దరి కలయికలో మూవీ సెట్ చేయడానికి దానయ్య ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం మహేష్ - ప్రశాంత్ సైన్ చేసిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అది ఎప్పుడు సాధ్యమైనా ట్రిపుల్ ఆర్ మేకర్స్ తోనే ఉంటుందని టాక్ నడుస్తోంది.