బుల్లి చియాన్ కి బ్యాడ్ టైమ్ నడుస్తోందా?

Thu Jan 27 2022 09:00:02 GMT+0530 (India Standard Time)

MahaanTo Release On OTT

చాలామంది నటవారసులకు కరోనా క్రైసిస్ కాలం సంక్లిష్ఠంగా మారింది. తమని తాము నిరూపించుకోవాలని కసిగా పని చేస్తున్నా కానీ అదంతా గంగలో పోసిన పన్నీరుగా మారుతోంది. చియాన్ విక్రమ్ నటవారసుడు ధృవ్ విక్రమ్ డెబ్యూ మూవీ రిలీజైనా ఇంకా రెండో సినిమా విడుదలకు చాలా సమయం వెయిట్ చేయాల్సి వస్తోంది. రెండేళ్లుగా కరోనా క్రైసిస్ విడిచిపెట్టడం లేదు. ఇది డెబ్యూ హీరో మూవీ రిలీజ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన `మహాన్`లో విక్రమ్- ధృవ్ కీలక పాత్రలలో నటంచారు. ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శితం కానుంది. జగమే తంధిరమ్ తర్వాత ఇది కార్తీక్ కి ప్రత్యేకంగా OTT ప్లాట్ ఫారమ్ లో రెండవ రిలీజ్ కానుంది.

విక్రమ్ -ధృవ్ నిజ జీవితంలో పాత్రలనే పెద్ద తెరపైనా పోషిస్తున్నారు. తండ్రీకొడుకులుగా `మహాన్`లో నటించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ మహాన్ చిత్రాన్ని నిర్మించారు. మహాన్ ను థియేటర్లలో విడుదల చేయాల్సి ఉండగా కోవిడ్-19 వ్యాప్తి కారణంగా మేకర్స్ OTT దారిలో వెళ్లారు.

ఇందులో ఒక సాధారణ మనిషి అతని చుట్టూ ఉన్న వారి జీవితాలను మార్చేసిన ఘటనల సీక్వెన్సును తెరపై ఆవిష్కరిస్తున్నారు. మహాన్ నిజ జీవితంలో తండ్రీకొడుకుల ద్వయం విక్రమ్ - ధృవ్ విక్రమ్ లను మొదటిసారి తెరపైకి తీసుకువచ్చారు. ఈ సినిమాలో బాబీ సిమ్మ- సిమ్రాన్ కూడా కీలక పాత్రలు పోషించారు. లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కానుంది. ఈ సినిమా విజయం సాధిస్తే ధృవ్ విక్రమ్ కి అది ప్లస్ అవుతుంది. ఆశించినది జరగకపోతే నటవారసుడికి బ్యాట్ టైమ్ రన్ అవుతున్నట్టేనని విశ్లేషిస్తున్నారు.