రక్తంతో తడిసిపోయిన హన్సిక చేతులు..ఆసక్తిని కలిగిస్తున్న 'మహా'!

Sun Aug 09 2020 22:00:01 GMT+0530 (IST)

Maha Latest Poster

ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా హిందీలో చిత్రాల్లో నటించిన హన్సిక.. 'దేశముదురు' చిత్రంతో హీరోయిన్ గా మారింది. 16 ఏళ్ళ వయసులోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్న హన్సిక తెలుగులో ప్రభాస్ - ఎన్టీఆర్ - రవితేజ - రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇక కోలీవుడ్ లో అడుగుపెట్టిన హన్సిక అక్కడ కూడా సత్తా చాటింది. స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసిన ఈ ఆపిల్ బ్యూటీకి తమిళనాట అభిమానులు ఏకంగా గుడి కట్టేసారు. అయితే తమిళంలో అవకాశాలు అందుకుంటున్నా తెలుగులో మాత్రం ఈ బ్యూటీకి అవకాశాలు రావడం లేదు. తెలుగులో చివరగా సందీప్ కిషన్ కు జోడిగా 'తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్' సినిమాలో నటించింది హన్సిక.కాగా నేడు హన్సిక మోత్వానీ పుట్టినరోజు. ఈ సందర్భంగా హన్సిక నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''మహా'' నుంచి ఓ ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశారు. హన్సిక కెరీర్లో 50వ చిత్రంగా తెరకెక్కుతున్న 'మహా' చిత్రానికి యూఆర్ జామీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'మహా' పోస్టర్స్ సంచలనంగా మారాయి. రక్తంతో నిండి ఉన్న టబ్ లో చేతిలో గన్ పట్టుకొని స్నానం చేస్తున్న పోస్టర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అంచనాలకు మరింత పెంచుతూ తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో హన్సిక నగ్నంగా ఉండటం తోపాటు ఆమె రెండు చేతులు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. దీంతో హన్సిక ఈ సినిమాతో ఆడియన్స్ కి థ్రిల్ కలిగించబోతోందని అర్థం అవుతోంది. ఇక ఈ సినిమాలో హన్సిక బికినీలో కూడా మెరవనుందట. అంతేకాకుండా హన్సిక మాజీ బాయ్ ఫ్రెండ్ శింబు కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం.