Begin typing your search above and press return to search.

'మాస్ట్రో' మెలోడీ.. 'బేబీ ఓ బేబీ' సాంగ్ లిరికల్ వీడియో..!

By:  Tupaki Desk   |   16 July 2021 6:01 AM GMT
మాస్ట్రో మెలోడీ.. బేబీ ఓ బేబీ సాంగ్ లిరికల్ వీడియో..!
X
యూత్ స్టార్ హీరో నితిన్ తన సినిమాలతో యూత్ ఆడియన్స్ తో పాటుగా ఫ్యామిలీ ప్రేక్షకులను దగ్గరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో విభిన్నమైన సబ్జెక్ట్స్ తో ప్రయోగాలు చేస్తుంటారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటిస్తున్న ''మాస్ట్రో'' సినిమా కూడా విలక్షణమైన కథతో వస్తోంది. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనున్నారు.

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'అంధాదున్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్ గా ''మాస్ట్రో'' తెరకెక్కుతోంది. కుర్ర భామ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ఫస్ట్ లుక్ పోస్టర్ - టీజర్‌ లకు విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో 'మాస్ట్రో మ్యూజిక్ ఫెస్ట్' పేరుతో వదిలిన 'బేబీ ఓ బేబీ' ఫస్ట్ సింగిల్ ప్రోమో ఫుల్ సాంగ్ కోసం ఆసక్తిగా వేచి చూసేలా చేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా 'బేబీ ఓ బేబీ' పూర్తి పాట లిరికల్ వీడియోని 'మాస్ట్రో' టీమ్ రిలీజ్ చేసింది. 'అంతులేని కళ్ళలోకిలా.. అందమొచ్చి దూకితే ఎలా.. మనసుకి లేని తొందరా.. మొదలిక మెల్ల మెల్లగా..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్ ని యువ మ్యూజిక్ సెన్సేషన్ అనురాగ్ కులకర్ణి వాయిస్ మరింత స్పెషల్ గా మార్చింది. దీనికి ప్రముఖ గీత రచయిత శ్రీజో సాహిత్యం అందించారు.

నితిన్ హీరోగా నటించిన 'భీష్మ' చిత్రానికి అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చిన మహతి స్వర సాగర్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తారని ఆశించవచ్చు. 'బేబీ ఓ బేబీ' పాట చూస్తుంటే నితిన్ - నభా నటేష్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్లు తెలుస్తుంది. గోవా లోని అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ షూట్ చేశారు. దీనికి భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. జె యువ‌రాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఎస్.ఆర్ శేఖర్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి 'మాస్ట్రో' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ న‌రేష్‌ - జిషుసేన్ గుప్తా - శ్రీ‌ముఖి - అన‌న్య‌ - హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ - ర‌చ్చ ర‌వి - మంగ్లీ - శ్రీ‌నివాస్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నితిన్ కెరీర్ లో మైలురాయి 30వ చిత్రంగా వస్తున్న 'మేస్ట్రో' విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.