బ్రెస్ట్ షో పై మడోనా సంచలన వ్యాఖ్యలు : ఏం చెప్పిందంటే..?

Sat Nov 27 2021 21:00:01 GMT+0530 (IST)

Madonna sensational comments on breast show

పాప్ సింగర్ మడోన్నా గురించి తెలియని వారుండరు. ఆమె పాటపాడితే శ్రోతల్లో ఎక్కడాలేని ఉత్సాహం. అంతేస్థాయిలో ఆమె చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా మడోన్నా వుమెన్ బాడీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పురుషులు తమ శరీరాన్ని అక్కడ చూపిస్తే పట్టించుకోరు.అయితే మహిళలు ప్రదర్శిస్తే రాద్దాంతం చేస్తారా..? అంటూ వ్యాఖ్యానించింది. ఇన్ స్ట్రాగ్రాం వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా వైరల్ గా మారుతున్నాయి. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే మడోన్నా తాజాగా ఆమె చేసిన వర్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మడోన్నా ఏమని వ్యాఖ్యలు చేసిందో చూద్దాం.

పాప్ సింగర్ గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మడోన్నా ఇటీవల సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. తాజాగా ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు సంబంధించిన సెమీ న్యూడ్ ఫొటోలను కొన్నింటిని మడోన్నా ఇన్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేసింది.

అవి ఇబ్బందికంగా ఉండడంతో వాటిని ఇన్ స్ట్రాగ్రామ్ తొలగించింది. అయితే మడోన్నా వాటిని మళ్లీ అప్లోడ్ చేసింది. అయితే మొదటిసారి అప్లోడ్ చేసిన ఈ ఫొటోల్లో తన బ్రెస్ట్ నిప్పల్ క్లియర్ గా కనిపించడంతో వాటిని తొలగించాల్సి వచ్చింది. కానీ మరోసారి షేర్ చేసినప్పుడు అవి కనిపించకుండా మడోన్నా జాగ్రత్తపడింది. అయితే ఆ తరువాత ఇన్ స్ట్రాగ్రాం తన ఫొటోలను తొలగించడంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

‘ప్రతీ వుమెన్ శరీర భాగంపై కొందరికి తప్పుడు ఆలోచనలు ఉంటాయి. ముఖ్యంగా నిప్పల్ చూపించగానే ఫొటోలను తొలగించారు. కానీ ఇవే ఒక బిడ్డ పెరగడానికి ఉపయోగపడుతాయని ఎందుకు ఆలోచించరు? స్త్రీని వెనుక భాగం మొత్తం చూపించినా ఏం చేయరు..కానీ చనుమ చూపించగానే తొలగిస్తారా..? నిప్పల్ ఒక్కటే స్త్రీ కామానికి సంకేతమా..? అని ప్రశ్నించింది. అలాగే మొగవాళ్లు తమ ఎదను పూర్తిగా చూపించినప్పుడు పట్టించుకోరు.

కానీ ఆడవాళ్లు ప్రదర్శిస్తే మాత్రం ఎందుకు రాద్ధాంతం చేస్తారు..? అని అడిగింది. ఈ విషయంలో మేల్స్ ఫీమేల్స్ మధ్య భేదం ఎందుకు..? అని ఇన్ స్ట్రాగ్రాంలో ఓ స్టోరీ రాసింది.

మడోన్నా ఇలాంటి వివిదాస్పద ఫొటోలు వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఆమె కరోనా సమయంలో తన అందాలను ఆరబోస్తూ బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియోను రిలీజ్ చేసింది. తన బ్రెస్ట్ పైరెండు పూలు పెట్టి ఇదే ఇన్ స్ట్రాగ్రాంలో పోస్టు చేసింది. కరోనాకు వివక్ష లేదు. అందరికీని ఆవహిస్తుంది.

అంటూ ఆ వీడియోతోపాటు మెసేజ్ పెట్టింది. కొన్ని రోజుల తరువాత మరో వీడియోను షేర్ చేసి ‘అందాలతతో కరోనాకు దయాదాక్షిణ్యాలు ఉండవని తెలిపింది. దీంతో ఆమె షేర్ చేసిన వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. ‘కరోనా మహమ్మారి ఎంత భయంకరమంటే.. నీవు సంపన్నుడివా..? లేదా ప్రముఖుడివా..?’ అన్న ట్యాగ్ పెట్టడంతో వైరల్ అయింది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలి గాయనిగా పేరు తెచ్చుకున్న ఈ భామ ఇలాంటి వివిదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆసక్తికంగా మారింది. అయితే ఎప్పుడూ ఇన్ స్ట్రాగ్రామ్ తో పోటీపడి తానుపోస్టులు చేయడం విశేషం. గాయనిగానే కాకుండా అందాల తారగా పేరు ప్రఖ్యాతలు పొందింది.

మరోపై అత్యధిక సంపన్నుల జాబితాల్లో మడోన్నా పేరు 2009లో ఫోర్బ్స్ పత్రిక సర్వేలో తెలిపింది. ‘స్టక్కీ అండ్ స్వీట్’ అనే సంగీతయాత్ర కారణంగానే ఆమె ఫోర్బ్స్ పత్రికలో ప్రచురణ అయిందని అంటుంటారు. ఈ యాత్ర ద్వారా ఆమె రూ.528 కోట్లు సంపాదించిందని ఆ పత్రిక తెలిపింది.