Begin typing your search above and press return to search.

లైవ్ షోలో మాడోన్నా కుమార్తె అలా చేసేసింది

By:  Tupaki Desk   |   10 Dec 2019 5:30 PM GMT
లైవ్ షోలో మాడోన్నా కుమార్తె అలా చేసేసింది
X
ఫ్యాషన్ షో అంటే.. చిత్రవిచిత్రమైన వేషధారణతో తమ దుస్తుల్ని ప్రదర్శిస్తారు. కొందరు ఫుల్ అయితే.. మరికొందరు హాఫ్.. ఇంకొందరు సెమీ న్యూడ్. ఇలా ఎన్నో ఫార్మాట్ లో చేసి ఉంటారు. మరి.. రోటీన్ కు భిన్నంగా..తమ షో గురించి ప్రపంచం మాట్లాడుకోవాలంటే.. సమ్ థింగ్ స్పెషల్ గా డిజైన్ చేయాల్సిందే. అందులో ఏదో ఒక సంచలనం ఉండాల్సిందే. అప్పుడే పేరుకు పేరు.. గుర్తింపుతో పాటు కష్టానికి ఫలితంతో పాటు టాలెంట్ ఏమిటో అందరికి అర్థమవుతుంది.

అందుకే కాబోలు తాజాగా మియామీలో జరిగిన ఆర్ట్ బేసెల్ అనే షోలో ఒక స్కిట్ చేశారు. ఫ్యాషన్ దుస్తులతో ర్యాంప్ మీద భిన్నంగా స్టెప్పులు వేసిన వారు ఒక పెద్ద గ్రూప్ కాసేపటికే తమ దుస్తుల్ని ఆర్టిస్టిక్ గా పక్కకు పడేస్తారు. ప్రపంచం మొత్తంలో ప్రేమలో మునిగితేలిపోతుందన్న చందంగా ఎరోటిక్ స్టిల్స్ తో షాకింగ్ షోను చేశారు.

30 మందినగ్నంగా ఒకరితో ఒకరు రొమాన్స్ చేసుకోవటమే కాదు.. గ్రూప్ గా ప్రేమ పారవశ్యంలో తేలిపోతున్నట్లుగా వారు చేసిన లైవ్ షో ఇప్పుడు షాకింగ్ గానే కాదు.. పెను సంచలనంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. అలా ఆడియన్స్ ముందు అంత సాహసోపేతమైన షో చేసిన 30 మంది ప్రఖ్యాత అమెరికన్ పాప్ సింగర్ మాడోన్నా కుమార్తె ఉండటం ఇప్పుడీ షో హాట్ టాపిక్ గా మారింది.

23 ఏళ్ల లోర్డేస్ లియోన్ తన షోతో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఎలాంటి జంకు లేకుండా ఆమె చేసిన షోకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ స్కిట్ లో పాల్గొన్న అమ్మాయిలు లో దుస్తులు మాత్రమే వేసుకున్నారు. ఏమైనా.. ఇలాంటి షో చేయటానికి ధైర్యం చాలానే ఉండాలి సుమా.

ఒక ప్రముఖురాలి కుమార్తెగా తనకున్న ఇమేజ్ కు భిన్నంగా మాడోన్నా కుమార్తో ఇలా చేయటమా అని విస్మయానికి గురవుతున్నారు. అయితే.. తన కుమార్తె చేసిన పనిని మాడోన్నా మద్దతు ఇస్తున్నారు. తన కూతురు చాలా టాలెంటెడ్ అని .. మంచి డ్యాన్సర్ అని.. గొప్ప నటి అని.. పియానో కూడా బాగా వాయిస్తోందని.. మొత్తంగా చూస్తే తన కంటే తన కుమార్తె మోస్ట్ టాలెంట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఏ తల్లి మాత్రం తన కుమార్తె తనకన్నా బెస్ట్ కాదని చెబుతుందనుకోండి?