Begin typing your search above and press return to search.

పేరు మార్చుకుని అక్కడ రెచ్చి పోతోంది

By:  Tupaki Desk   |   19 Jun 2021 4:30 PM GMT
పేరు మార్చుకుని అక్కడ రెచ్చి పోతోంది
X
తెలుగు లో ఆ ఒక్కడు సినిమా తో పరిచయం అయిన మధురిమ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కాని ఈ అమ్మడికి తెలుగులో సాలిడ్ సక్సెస్ పడలేదు. దాంతో ఈ అమ్మడు టాలీవుడ్‌ కు దూరం అయ్యింది. అప్పుడప్పుడు గెస్ట్‌ రోల్స్ చేస్తూ వచ్చిన మధురిమ తన పేరును నైరా బెనర్జీగా మార్చేసుకుని ఉత్తరాదిన బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం నైరా బెనర్జీగా హలో జీ అనే వెబ్‌ సిరీస్‌ తో ఈ అమ్మడు ఆకట్టుకుంటూ ఉంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన ఆ వెబ్‌ సిరీస్‌ ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది.

హాట్ పాత్రలో కనిపించిన ఈమె ఎంట్రీ ఇచ్చి ఇన్నాళ్లు అయినా కూడా ఏమాత్రం అందం తగ్గలేదు అనే కామెంట్స్ దక్కించుకుంది. వెబ్ సిరీస్ లో ఈమె బోల్డ్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సినిమాకు వెబ్‌ సిరీస్‌ కు సంబంధించిన ప్రోమోలు మరియు సీన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ అమ్మడి నటనకు మరియు అందానికి ప్రశంసలు దక్కడంతో మరిన్ని ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.

మధురిమ అలియాస్‌ నైరా బెనర్జీ హలో జీ వెబ్‌ సిరీస్ తో మళ్లీ బిజీ అవ్వడం ఖాయం గా అనిపిస్తుంది. హిందీలో ఇప్పటికే ఈమెతో ఒకరు ఇద్దరు నిర్మాతలు కూడా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అమ్మడు మళ్లీ సౌత్‌ లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.