ఈ సినిమా ఆడకుంటే ఇండస్ట్రీకి గుడ్‌బై !

Thu Sep 16 2021 17:00:01 GMT+0530 (IST)

MVV Satyanarayana speech in Guillyrowdy Event

ప్రి రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత తను నిర్మించిన చిత్రం ఆడకుంటే ఇకపై సినిమాలు నిర్మించనని.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తానని షాకింగ్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సంచలన వ్యాఖ్యలు మంగమ శపథాలు చేసిన నిర్మాత మరెవరో కాదు `గల్లీ రౌడీ` ప్రొడ్యూసర్ ఎంవీవీ సత్యనారాయణ. సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రమిది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. సినిమాలోని నటీనటులు మరియు సిబ్బందితో పాటు ఈ కార్యక్రమంలో చిత్ర బృందంలోని అందరూ పాల్గొన్నారు.ఇదే ఈవెంట్‌కు అతిథులుగా విశ్వక్ సేన్.. తేజ సజ్జ.. సిద్ధు జొన్నలగడ్డ పాల్గొన్నారు. వీరంతా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్న `గల్లీ రౌడీ` సినిమా ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులందరి ఒత్తిడి దూరం చేస్తుందని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిజ జీవితంలో జరిగే సంఘటనలతో ప్రజలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు అలాంటి వారికి గల్లీ రౌడీ ఉపశమనం కలిగిస్తాడన్నారు.

ఇదే సందర్భంగా నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాపై తనకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ఇది మొదటి నుండి చివరి వరకు పూర్తి వినోదాత్మకంగా సాగే చిత్రం. ఇప్పటి వరకు నా జడ్జిమెంట్ కరెక్ట్ అవుతూ వచ్చింది. `గల్లీ రౌడీ` విషయంలోనూ అదే నిజమవుతుంది. కొనసాగుతాడు. గల్లీ రౌడీ విఫలమైతే ఇకపై సినిమాలు నిర్మించడం మానేస్తానని ఎంవివి సత్యనారాయణ అన్నారు.

జి నాగేశ్వర్ రెడ్డి `గల్లీ రౌడీ`కి దర్శకత్వం వహించారు. ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించగా.. నేహా శెట్టి హీరోయిన్. కోన వెంకట్.. ఎంవివి సత్యనారాయణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చౌరస్తా రామ్.. సాయి కార్తీక్ సంగీతం అందించారు.

సందీప్ కిషన్ హీరోగా నటించిన `గల్లీ రౌడీ` ఈ నెల 17 న థియేటర్లలోకి రానుంది. సెకండ్ వేవ్ తర్వాత సినిమా థియేటర్లలో విడుదలవుతున్న అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ మూవీ థియేట్రికల్‌గా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందా అని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.