Begin typing your search above and press return to search.

రాజు గారికి కోపమొచ్చింది..!

By:  Tupaki Desk   |   26 Jan 2023 10:00 AM GMT
రాజు గారికి కోపమొచ్చింది..!
X
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎమ్మెస్ రాజు అంటే ఒక ప్రత్యేకమైన ఇంప్రెషన్ ఉంటుంది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో ఆయన చేసిన సినిమాలు ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు స్టార్స్ గా సత్తా చాటుతున్న మహేష్, ప్రభాస్ లకు కెరీర్ టర్నింగ్ హిట్లు ఇచ్చిన బ్యానర్ అది. అలాంటి ఎమ్మెస్ రాజు నిర్మాణం వదిలి డైరెక్షన్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఆయన రూట్ మార్చినా ఆయన నిర్మించిన సినిమాలు ఆయన్ను గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఈమధ్య స్టార్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుండగా వాటిలో ఎమ్మెస్ రాజు నిర్మించిన ఒక్కడు, వర్షం సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.

ఈ రెండు సినిమాలు ఎమ్మెస్ రాజు బ్యానర్ నుంచి వచ్చినవే. రెండు సినిమాలు ఆ హీరోలకు మాస్ ఇమేజ్ తీసుకురావడంలో భాగమైనవే. అయితే ఒక్కడు సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఎమ్మెస్ రాజు ఒక ట్వీట్ చేశారు. ఇది ఒక పండుగలా ఉంది.. కుదుస్ టూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అని రాసుకొచ్చారు. అయితే ఒక్కడు రీ రిలీజ్ కు ట్వీట్ చేసిన ఎమ్మెస్ రాజు ప్రభాస్ వర్షం సినిమాకు ఎందుకు ట్వీట్ వేయలేదని ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది.

అందులో ఒక అభిమాని వర్షం సెలబ్రేషన్స్ అతనికి కనిపించలేదా అన్నట్టు పెట్టాడు. దానికి ఎమ్మెస్ రాజు సడెన్ గా అతనికి సమాధానం ఇస్తూ ఒరేయ్ నీ యబ్బ మూసుకో అంటూ సమాధానం ఇచ్చారు. అసలు ఎందుకు ఎమ్మెస్ రాజు అంత ఫైర్ అయ్యారన్నది తెలియలేదు.

ఎమ్మెస్ రాజు నిర్మించిన అన్ని సినిమాలు అందరు హీరోలు అతనికి సమానమే. నిర్మాతలు ఎప్పుడు ఒక హీరోని ఎక్కువ... మరో హీరోని తక్కువ చేసి చూడరు. కానీ అభిమానులు ఇలా అడిగిన సమయంలో వారు కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు.

అయితే ఎమ్మెస్ రాజు ప్రభాస్ ఫ్యాన్ చేసిన ట్వీట్ కు రెస్పాండ్ అయిన విధానం కూడా అంత కరెక్ట్ గా లేదని చెప్పొచ్చు. అసలు అర్ధాంతరంగా రాజు గారికి ఎందుకు కోపం వచ్చిందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ప్రభాస్ వర్షం సినిమా టైం లో కూడా ఎమ్మెస్ రాజు బయటకు అనౌన్స్ చేయకపోయినా తనలో తాను హ్యాపీగా ఉండి ఉండవచ్చు.

ఒక్కడు టైం లో ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించి ఉండవచ్చు. ఏది ఏమైనా అభిమాని ఏదో కామెంట్ పెట్టాడని అంత గొప్ప సినిమాలు తీసిన నిర్మాత ఒరేయ్ నీయబ్బ అని కామెంట్ చేయడం ఇబ్బంది కరంగానే అనిపించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.