క్రికెట్ సూపర్ స్టార్ తో లేడీ సూపర్ స్టార్.. సూపర్ కాంబో

Thu May 12 2022 18:00:17 GMT+0530 (India Standard Time)

MS Dhoni joins hands with Nayanthara for a movie

క్రికెట్ లో సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కొత్త ఇన్నింగ్స్ ను సినిమా ఇండస్ట్రీలో మొదలు పెట్టబోతున్నాడు. చాలా కాలం నుండే ఆయన సినిమా ఇండస్ట్రీ వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమాల మేకింగ్ విషయాల్లో ధోనీ దగ్గర నుండి చూస్తూ డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా సినిమా ఇండస్ట్రీలో ఏదో విధంగా కొనసాగుతూ వస్తున్నాడు.ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని భావిస్తున్నాడు. ధోనీ క్రికెటర్ గానే కాకుండా ఎన్నో రంగాల్లో వ్యాపారాల్లో అడుగు పెట్టాడు. ఆయన అడుగు పెట్టిన ప్రతి చోట సిక్సర్స్.. ఫోర్స్ తో భారీ విజయాలను ఆయా సంస్థలు.. వ్యాపారాలు దక్కించుకుంటున్నాయి. ఇప్పుడు ఆయన బ్యాట్ సినిమా ఇండస్ట్రీ పై పడబోతుంది. ఇక్కడ కూడా సిక్సర్స్.. ఫోర్స్ తో కుమ్మేయడం ఖాయం అంటున్నారు.

క్రికెటర్ గా సూపర్ స్టార్ అయిన ఎంఎస్ ధోనీ నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న నయనతార హీరోయిన్ గా ఒక సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. నయనతార కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమాను కూడా చేస్తుంది. కనుక నయనతార తో తన మొదటి ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని ధోనీ భావిస్తూ ఉండవచ్చు.

నయనతార ప్రస్తుతం వచ్చే నెలలో జరుగబోతున్న పెళ్లితో బిజీగా ఉంటే.. ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ తో బిజీగా ఉన్నాడు. వీరిద్దరి కాంబో సినిమా ఆగస్టులో లేదా కాస్త అటు ఇటుగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు బిజీగా ఉన్నా కూడా వీరి టీమ్ మాత్రం ఆ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

స్క్రిప్ట్ మరియు నిర్మాణ సంస్థ ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ధోనీ సన్నిహిత వర్గం వారు బాలీవుడ్ మీడియా కు మరియు చెన్నై మీడియాకు లీక్స్ ఇస్తున్నారు. నయనతార మరియు ధోనీల కలయిక అంటే ఖచ్చితంగా అది రియల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. వీరిద్దరి కాంబో కోసం ప్రతి ఒక్క సినీ మరియు క్రికెట్ అభిమాని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.