Begin typing your search above and press return to search.

తాప్సీ మ‌రో ప్ర‌యోగం స‌క్సెస‌వుతుందా?

By:  Tupaki Desk   |   13 Jan 2022 2:41 PM GMT
తాప్సీ మ‌రో ప్ర‌యోగం స‌క్సెస‌వుతుందా?
X
వ‌రుస ప్ర‌యోగాల‌తో ఆక‌ట్టుకుంటోంది తాప్సీ ప‌న్ను. బాలీవుడ్ లో త‌న స్థానాన్ని ప్ర‌యోగాలే కాపాడాయ‌ని చెప్పొచ్చు. రష్మీ రాకెట్ కోసం తాప్సీ పన్ను ట్రాక్ శిక్షణ ఆమె తదుపరి విడుదలైన లూప్ లాపేట కోసం ఉపయోగపడింది. జర్మన్ హిట్ `రన్ లోలా రన్` కి ఇది అధికారిక‌ రీమేక్. ఈ చిత్రంలో తాహిర్ రాజ్ భాసిన్ పోషించిన `పనికిరాని ప్రియుడు`ని రక్షించడానికి ప్రయత్నించే యువ‌తిగా తాప్సీ నటించింది. టైమ్ లూప్ లో చిక్కుకున్న గాళ్ ఫ్రెండ్ గా తాప్సీ క‌నిపిస్తోంది.

లీడ్ క్యారెక్టర్ లవ్ స్టోరీని పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అతను మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు తాప్సీతో. తాను కిందికి దిగి వ‌చ్చి అత‌డిని కట్టుకోవడానికి ఇది సరైన సమయం అని ఆమె నిర్ణయించుకుంటుంది. కాసినోలో బ్యాడ్ డే తర్వాత బాయ్ ఫ్రెండ్ కొంద‌రు గూండాల చేతికి చిక్కుతాడు. దీంతో గందరగోళంలో పడే వరకు అంతా బాగానే ఉంటుంది కానీ ఆ త‌ర్వాతే మారిపోతోంది స‌న్నివేశం. అయితే తాప్సీ మాత్రమే అతన్ని రక్షించగలదు. కానీ ఆమె అన్ని వేళలా విజయవంతం కాదు.. ఆమె నిజంగా టైమ్ లూప్ లో చిక్కుకున్నట్లు త్వరలోనే తెలుసుకుంటుంది. మళ్లీ మళ్లీ త‌న‌ వేట ప్రారంభమవుతుండ‌డ‌మే ఇక్క‌డ ట్విస్టు. ట్రైల‌ర్ ఆద్యంతం ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశానికి త‌గ్గ‌ట్టే ఇందులో డ‌బ్బు అనే టాపిక్ ఉత్కంఠ‌ను పెంచుతోంది.

లూప్ లాపేటకు నూతన దర్శకుడు ఆకాష్ భాటియా దర్శకత్వం వహించారు. ఆయుష్ మహేశ్వరితో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా- ఎలిప్సిస్ ఎంటర్ టైన్ మెంట్ లు సంయుక్తంగా నిర్మించాయి. ఫిబ్రవరి 4న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

ఈ చిత్రం గురించి తాప్సీ మాట్లాడుతూ.. ``ఈ ఆకట్టుకునే కథను నా దర్శకుడు ఆకాష్ .. సహనటుడు తాహిర్ తో కలిసి చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. అభిమానులు ప్రేక్షకులు ఈ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఫిల్మ్ ని చూడాలని మేము దీన్ని ఇష్టపడినంతగా ఆనందిస్తారని చెప్పేందుకు వేచి ఉండలేను`` అని తెలిపింది. సత్యగా కనిపించనున్న తాహిర్ లూప్ లాపేట రొమాన్స్ లో కొత్త టేక్ ని అందిస్తుందని సినిమాను ప్రేక్షకులకు చూపించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ చిత్రం కొత్త యుగపు రొమాన్స్ కొత్త‌గా అనిపిస్తుంది. నేను మొదటిసారిగా అన్వేషిస్తున్న జానర్ ఇది. సత్య - సావి పాత్రలను ప్రపంచం కలుసుకునే వరకు నేను వేచి ఉండలేను... అని తాప్సీ వ్యాఖ్యానించింది. మా దర్శకుడు ఒక ప్రత్యేకమైన శైలి స్టాంప్ ని కలిగి ఉన్నాడు. ఇది విజువల్ గా అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించింది. థ్రిల్ -కామెడీ ఒక క్రేజీ రోలర్- కోస్టర్ ఎంటర్ టైనర్ మీకు అందిస్తున్నామ‌ని తెలిపారు.