Begin typing your search above and press return to search.

నాన‌మ్మ‌తో క‌లిసి `పుష్ప` సిగ్నేచ‌ర్ స్టెప్

By:  Tupaki Desk   |   26 Jan 2022 11:27 AM GMT
నాన‌మ్మ‌తో క‌లిసి `పుష్ప` సిగ్నేచ‌ర్ స్టెప్
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప‌` వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం వ‌సూళ్ల పరంగా బాలీవుడ్ లో రికార్డు ల్ని తిర‌గ‌రాస్తూ ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌య‌ప‌రుస్తోంది. బ‌న్నీని ఐకాన్ స్టార్ గా మార్చి వ‌ర‌ల్డ్ వైడ్ గా క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఇప్ప‌టికే తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో క్రేజ్ ని సొంతం చేసుకున్న బ‌న్నీకి ఇప్పుడు `పుష్ప‌`తో పాన్ ఇండియా స్థాయిలో పేరొచ్చింది.

ఈ సినిమాని సుకుమార్ ఏ ముహూర్తాన మొద‌లుపెట్టాడో కానీ బ‌న్నీ అనుకున్న‌ట్టుగానే త‌న‌ని పాన్ ఇండియా స్టార్ గా మార్చి ప‌లువురికి షాకిచ్చింది. బ‌న్నీ సినిమాలు డ‌బ్బింగ్ వెర్ష‌న్ బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో `పుష్ప‌`కు బాగా ప్ల‌స్ గా మారింది. అదే ఇప్ప‌డు `పుష్ప‌`కు నార్త్ లో భారీ వ‌సూళ్ల‌ని తెచ్చిపెట్టింది. ఈ మూవీ విడుద‌లై నెల రోజులు కావ‌స్తున్నా దీని హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. `పుష్ప‌` మేనియా ఎల్ల‌లు దాటి వ‌ర‌ల్డ్ వైడ్ గా విస్త‌రిస్తోంది.

క్రేజీ స్టార్ ల‌తో పాటు క్రికెట‌ర్లు కూడా దీని మేనియాకు ఫిదా అయిపోతున్నారు. ఇండియ‌న్ క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా నుంచి డేవిడ్ వార్న‌ర్‌, బ్రావో.. వ‌ర‌కు పుష్ప మేనియాకు ఫిదా అయిపోయి సిగ్నేచ‌ర్ స్టెప్పుల‌ని రీ క్రియేట్ చేస్తూ మురిసిపోయారు. ఆ వీడియోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకోవ‌డంతో అవి నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

తాజాగా ఈజాబితాలోకి మ‌రో క్రికెట‌ర్ చేరాడు. అయితే తాను సోలోగా పెర్ఫార్మ్ చేయ‌కుండా త‌న నాన‌మ్మ‌తో క‌లిసి శ్రీ‌వ‌ల్లి పాట‌కు `పుష్ప‌` సిగ్నేచ‌ర్ స్టెప్ వేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఇండియ‌న్ క్రేజీ క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యా త‌న నాన‌మ్మ‌తో క‌లిసి శ్రీ‌వ‌ల్లి పాట‌కు `పుష్ప‌` సిగ్నేచ‌ర్ స్టెప్ వేశాడు. ఈ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేయ‌డంతో అది ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.