పంజాబీ ధాబా..చెరుకు తోటలు అన్ని చుట్టేసిన లైగర్ టీమ్!

Fri Aug 12 2022 18:04:11 GMT+0530 (IST)

Liger in Chandigarh Vijay Deverakonda lifts Ananya Panday

`లైగర్` టీమ్ ప్రచారంలో భాగంగా ఉత్తరాదిన అన్ని రాష్ర్టాలు చుట్టేస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రచారాన్ని లైట్ తీసుకుని హిందీపై నే  పూరి అండ్ టీమ్ ప్రత్యేకంగా దృష్టిసారించి  ప్రమోట్ చేస్తుంది. పాజిటివ్ టాక్ వస్తే గనుక  `లైగర్` దెబ్బకి హిందీ బాక్సా ఫీస్ షేక్ అయిపోయేలానే? ఉంటుందని పూరిలో ధీమా కనిపిస్తుంది.ఈ సినిమాతో విజయ్ హిందీలో పెద్ద స్టార్ అయితే... అదే సినిమాతో పూరి అగ్ర దర్శకుల జాబితాలోనూ నిలిచిపోయేలా ప్లాన్ చేసినట్లు ప్రణాళిక కనిపిస్తుంది. `లైగర్` విషయంలో తొలి నుంచి పూరి అదే స్ర్టాటజీతో ముందుకు కదులుతున్నారు. తాజాగా `లైగర్` పుణే లో ప్రచారాన్ని  ముగించుకుని చండీఘర్ కి షిప్ట్ అయినట్లు తెలుస్తోంది.

ఆన్ ది వేలో ట్రావెలింగ్ ని ఎంతో ఆస్వాదిస్తున్నారు. ట్రావెలింగ్ ప్రియుడు పూరి పక్కనే ఉంటే?  ఆ జర్నీ  ఇంకా ఎంజాయ్ మెంట్ ని అందిస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకోండ..అనన్య పాండే..ఛార్మీ అదే ఆస్వాదనలో ఉన్నట్లు కనిపిస్తుంది. సహనటులిద్దరు  తెల్లని దుస్తులు ధరించారు.  విజయ్ తెల్లటి కుర్తా పైజామాలో మనో హరంగా కనిపిస్తున్నాడు.

అనన్యా పాండే  సల్వార్ కమీజ్‌లో ఎంతో అందంగా కనిపిస్తుంది. మార్గమధ్యలో ఇద్దరు ఇలా జంటగా కెమెరాకి ఫోజులిచ్చారు. అన్యని విజయ్ తచేతుల్లోకి తీసుకుని పైకెత్తి గాల్లో తిప్పుతున్నాడు. మరో ఫోటోలో ఇద్దరు ట్రాక్టర్ పై నుంచి ఫోజులిచ్చారు. ఈ ఫోటోల్ని ధర్మ ప్రొడక్షన్స్ అధికారిక ఖాతా ద్వారా రివీల్ చేసారు.

#చండీఘర్ ఈ #లైగర్ ద్వయం మీ నగరంలో #కోకా 2.0తో సరికొత్త బీట్‌లను వదలడానికి సిద్ధంగా ఉంది.  మీకు తెలుసు.  చండీగఢ్‌లో ఉన్నప్పుడు - చండీగఢ్ వాసులు ఎలా చేస్తారో?  అలా చేసింది!` అంటూ అక్కడి విశేషాలు పంచుకుంది. ఇక  ఈ బృందం పంజాబీ వంటకాలు అన్నింటిని జుర్రేసింది. ధాబాలో నులుక మంచం మీద కుర్చుని రోటీలు..నచ్చిన కర్రీలు ఆర్డర్ చేసుకుని లాగించేసారు.

కొన్ని పంజాబీ వంటకాలకు ఈ బృందం ఫిదా అయింది. మరి దీని వెనుక కర్త..కర్మ..క్రియ ఛార్మీ అయ్యిండొచ్చు. ఛార్మీ పుట్టి పెరిగింది పంజాబ్ లోనే. కాబట్టి ఛార్మీనే ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు. ధాబాలో లల్సీ  స్పెషాల్టీ గురించి అనన్య...ఛార్మీ ఇలా ఫోజులిచ్చి చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. విజయ్ అభిమానులు వాటిని చూసి ఫిదా అయిపోతున్నారు.