'లైగర్' డీల్ ఇప్పటికీ క్లోజ్ కాలేదా?

Sun Aug 14 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Liger deal still not closed

విజయ్ దేవరకొండ నటించిన భారీ యాక్షన్ డ్రామా `లైగర్`. పూరి జగన్నాథ్ `ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత చేస్తున్న సినిమా ఇది. అంతే కాకుండా బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అపూర్వ మొహతా ధర్మా ప్రొడక్షన్స్ తో కలిసి ఛార్మి పూరి ఈ మూవీని నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఆగస్టు 25న అత్యంత భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక అతిథి పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్ కి టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ ని అగ్రెసీవ్ గా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

నేవీ ముంబైలోని ఓ మాల్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ తో ఈ మూవీ ప్రమోషన్స్ ని ప్రారంభించారు. ఎక్కడికి వెళ్లినా విజయ్ దేవరకొండ క్రేజ్ కి అభిమానులు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ భారీ క్రైడ్ తో నిండిపోతున్నారు.

రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండకు తల్లిగా నటించిన రమ్యకృష్ణపై చిత్రీకరించిన విజువల్స్ తను చెప్పే డైలాగ్స్ సినిమాకు మరింత బూస్ట్ నిచ్చాయి. ఇదిలా వుంటే సినిమా రిలీజ్ కి మరో 12 రోజులు మాత్రమే వున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ షాకింగ్ అప్ డేట్ తాజాగా బయటికి వచ్చింది. ట్రైలర్ తో బజ్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ బిజినెస్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా క్లోజ్ కాకపోవడం షాకిస్తోంది.

కారణం మేకర్స్ భారీగా రైట్స్ కోసం డిమాండ్ చేయడమేనని తెలుస్తోంది. అంత పెద్ద మొత్తం ఇచ్చి రిస్క్ చేయలేక డిస్ట్రిబ్యూటర్స్ కూడా వేయిటింగ్ లిస్ట్ లో వున్నారట. కొంత మంది మేకర్స్ ని తగ్గించుకుని ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంటే మరి కొంత మంది మాత్రం అడ్వాన్స్ ఎన్ ఆర్ ఏ బేసిస్ లో అడుగుతున్నారట. వరంగల్ శ్రీను థియేట్రికల్ హక్కుల్ని దక్కించుకుని డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుపుతున్నారట.

నైజాంలో తానే రిలీజ్ చేయబోతున్నాడట. ఇక మిగతా ఏరియాల కోసం మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చిస్తున్నారట. మూవీ రిలీజ్ కు రెండు వారాలు కూడా  లేకపోవడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ కన్ఫ్యూజన్ ఏంటీ లైగర్ అని ఫ్యాన్స్ కామెంట్ లు చేస్తున్నారట.