స్వీయ ప్రమోషన్ కోసం నెలకు రూ.15 లక్షలు ఖర్చు చేస్తున్న దిగ్గజ దర్శకుడు?

Sun Dec 04 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Legendary director spending Rs15 lakhs per month for self promotion

సౌత్ ఇండియాలో సినిమాలు తెరకెక్కించి బాలీవుడ్ లో కూడా సత్తా చాటిన దర్శకుడు ఆయన. ఆయన దర్శకత్వంలో  సినిమాలు చేసేందుకు ఒక్కో హీరో ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేశారు.. చేసేందుకు సిద్ధం అన్నట్లుగా ఉన్నారు. అయినా కూడా ఆయన ఆచి తూచి సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇటీవల ఆయన సినిమా మరో సంచలనం అన్నట్లుగా నిలిచింది.ఆయనకు పబ్లిసిటీ అక్కర్లేదు.. ఆయన పబ్లిసిటీ కోసం చిన్న సినిమా వారి నుండి పెద్ద హీరోల సినిమాల వారి వరకు పాకులాడుతూ ఉంటారు. ఆయన ఒక్క సారి మా సినిమా గురించి మాట్లాడితే బాగుండు అని.. ఒక్క సారి మా గురించి నాలుగు మాటలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే బాగుండు అనుకుంటారు.

అలాంటి దిగ్గజ దర్శకుడు తన సొంత పబ్లిసిటీ కోసం ఏకంగా నెలకు రూ.15 లక్షలను ఖర్చు చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముంబయికి చెందిన ప్రముఖ డిజిటల్ ప్రమోషన్ సంస్థతో ఈ దర్శకుడు ఒప్పందం చేసుకుని తనను ఇన్ స్టా గ్రామ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ప్రమోట్ చేయాలని చెప్పాడట.

ఈయనకు ఉన్న పబ్లిసిటీ అంతా ఇంతా కాదు.. అయినా కూడా ఇన్ స్టా గ్రామ్ ద్వారా అంతగా ప్రమోషన్ ఎందుకు కావాలి అనుకుంటున్నాడో అర్థం కావడం లేదు అంటూ చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు. మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్న మీమ్స్ పేజీలతో పాటు ఇంకా రకరకాల సోషల్ మీడియా పేజీల్లో ఇప్పటికే ఆ దర్శకుడి యొక్క పబ్లిసిటీ మొదలు అయ్యింది.

ఆయన ఏం చేసినా కూడ చాలా పెద్ద కారణం ఉంటుంది.. ప్రతి రూపాయికి పది రూపాయలు వెనక్కి వచ్చే ఉద్దేశ్యాలు ఉంటాయి. కనుక ఆయన తనను తాను ప్రమోట్ చేసుకోవడం అనేది తన తదుపరి సినిమా యొక్క మార్కెట్ కోసం అయ్యి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నెలకు 15 ఖర్చు చేసి హాలీవుడ్ లో ప్రమోట్ చేసుకుంటే పదుల కోట్ల రూపాయలు తన సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఆయన అలా చేస్తూ ఉండవచ్చు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆయనకు ఆయన  టీం కే తెలియాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.