ఇంకా ఐసీయూలోనే భారతరత్నం

Mon Jan 17 2022 11:21:50 GMT+0530 (IST)

Legendary Singer health continues to worsen, placed in ICU

ప్రముఖ గాయిని లత మంగేష్కర్ ఇటీవల కోవిడ్ బారిన పడ్డ విషయం తెల్సిందే. ఆమె ఆరోగ్య విషయం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. గత కొన్ని రోజులుగా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. వైధ్యులు ఆమెను కొన్ని రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచాల్సిందే అన్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమెను ఎవరికి కలవనీయడం లేదట. పూర్తిగా ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా ప్రకటించారు. 92 ఏళ్ల ఈ గాయిని గతంతో కూడా తీవ్రమైన అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం గురించి పుకార్లు షికార్లు చేశాయి. కాని అనూహ్యంగా అభిమానుల పూజలు ఫలించి బతికారు.92 ఏళ్ల భారత రత్నం లతా మంగేష్కర్ వయసు మీద పడటంతో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలోనే ఆమె కోవిడ్ బారిన పడటంతో ఇబ్బందిగా మారింది. ఆమె వయసు రిత్యా కోవిడ్ ను జయించేందుకు ఇబ్బంది పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె అనారోగ్య సమస్యలు కోవిడ్ ను మరింత ముదిరేలా చేస్తున్నాయంటూ వైధ్యులు చెప్పుకొచ్చారు. అభిమానులు ఏ సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోసారి లతా మంగేష్కర్ ఆరోగ్యం బాగుపడాలంటే అభిమానులు మరియు కుటుంబ సభ్యులు పూజలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రముఖులు కూడా ఆమె ఆరోగ్యం విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐసీయూలో ఉన్న ఆమె ఆరోగ్యం విషయమై ప్రస్తుతం ఆందోళన అక్కర్లేదు కాని ముందు ముందు ఆమె కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ రోజులు ఆమెను ఐసీయూలో ఉంచుతున్నట్లుగా వైధ్యులు చెబుతున్నారు. అతి త్వరలోనే లతా మంగేష్కర్ ఐసీయూ నుండి బయటకు వస్తారు.. పూర్తి ఆరోగ్యంతో ఆమె ఇంటికి వస్తారనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.