Begin typing your search above and press return to search.

RRR క్లైమాక్స్ లీక్.. బెంగాళ్ టైగ‌ర్ తో యంగ్ టైగ‌ర్ ఢీ

By:  Tupaki Desk   |   4 March 2021 4:30 AM GMT
RRR క్లైమాక్స్ లీక్.. బెంగాళ్ టైగ‌ర్ తో యంగ్ టైగ‌ర్ ఢీ
X
ఎంత‌గా గుప్పిట ప‌ట్టి ఉంచ‌గ‌లిగితే అంత క్యూరియాసిటీ. కానీ ఇక్క‌డ క్రేజీ సినిమాల‌కు సంబంధించి ఏదీ దాగ‌దు. జ‌క్క‌న్న లాంటి ఠ‌ఫ్ టాస్క్ మాస్టరే చేతులెత్తేశారు. ఆన్ లొకేష‌న్ వ్య‌వ‌హారాలు ఏదీ దాచ‌లేక‌పోతున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు లీకైపోతుంటే ఆయ‌న ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. ఎంత‌గా చిత్ర‌బృందానికి క‌ఠిన నియ‌మావ‌ళి రూపొందించినా అవేవీ ప‌ట్టించుకున్న‌ట్టు లేదు.

ఇంత‌కుముందే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రాక ముందు లీకులు క‌ల‌వ‌ర‌పెట్టాయి. తారక్ .. చ‌ర‌ణ్ ప‌బ్లిక్ అప్పియ‌రెన్సెస్ ఈ మూవీలో పాత్ర‌ల లుక్ లు ఎలా ఉంటాయో బ‌య‌ట‌పెట్టేశాయి. అధికారికంగా కొన్ని పోస్ట‌ర్లు రిలీజైనా .. అన‌ధికారికంగా లీకులే ఎక్కువై క‌ల‌వ‌ర‌పెట్టేస్తున్నాయి. సెట్లోకి మొబైల్ ని అనుమ‌తించ‌క‌పోయినా మరి ఈ లీకులు ఎలా వ‌స్తున్నాయి? అన్న‌దే ఎవ‌రికీ అర్థంకాని ప‌రిస్థితి.

తాజాగా ఆర్.ఆర్.ఆర్ ప‌తాక స‌న్నివేశాల నుంచి కీల‌కమైన ఘ‌ట్టం లీకైపోవ‌డం సంచ‌ల‌న‌మే అయ్యింది. ఇందులో క్లైమాక్స్ భీక‌ర పోరాటం ఒక‌టి లీకైపోయింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పెద్ద పులితో పోరాడే సీన్ లుక్ మొత్తం లీకైంది. ఇది చూస్తుంటే సినిమాకే ఆ పోరాటం హైలైట్ గా ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. గ్లాడియేట‌ర్ పులి ఫైట్ లా.. హైప్ తెస్తుంద‌నే ఆశిస్తున్నారు.

ఇంత‌కుముందు ఓల్డ్ డేస్ బ్రిటన్ సైనికుల దుస్తులలో రామ్ చరణ్ ఫైరింగ్ ఫోటోలు లీక‌య్యాయి. అలాగే ఎన్టీఆర్ పోరాటాల‌కు సంబంధించిన లీకులు కూడా వచ్చాయి. అలాగే లండన్ కు చెందిన నటి ఒలివియా మోరిస్ లుక్ కి సంబంధించిన లీకులు రివీల‌య్యాయి. అయితే ఇవ‌న్నీ లీకులు కాబ‌ట్టి ఫోటోలు ఏమంత క్లారిటీ లేవు. కానీ సినిమాలో మ్యాట‌ర్ ఇదీ అని రివీలైపోయింది.

సెట్స్ పైకి ఫోన్లు అనుమ‌తించ‌క‌పోయినా ఇవ‌న్నీ ఎలా వ‌స్తున్నాయి? ఎవ‌రైనా ప్ర‌ముఖుడే వీటిని లీకిస్తున్నారా? లేక ఎడిట్ ల్యాబునుంచే ఇవ‌న్నీ బ‌య‌టికి వ‌స్తున్నాయా? మ‌రి జ‌క్క‌న్న- దాన‌య్య టీమ్ ఈ లీకుల్ని ఇలానే ఉపేక్షించ‌డానికి కార‌ణం ఏమిటి?