లీక్డ్ ఫోటో: పింక్ బికినీలో దుమారం రేపిన శ్రద్ధా

Thu Jul 07 2022 10:15:52 GMT+0530 (IST)

Leaked photo: Shraddha slays in pink bikini

'ఆషిఖి 2'(2013)తో యువత హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ శ్రద్ధా కపూర్. బాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర నాయికగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 'సాహో' చిత్రంలో ప్రభాస్ కి డార్లింగ్ గా నటించిన ఈ బ్యూటీకి సౌత్ లోనూ భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ శ్రద్ధా ప్రస్తుతం బాలీవుడ్ లో కెరీర్ పరంగా బిజీ బిజీ.ఇక శ్రద్ధా అందచందాలు నటనకు ముగ్ధులు కానివాళ్లు లేరు. ఈ బ్యూటీ కి ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫాలోయింగ్ ఉంది. శ్రద్ధా కపూర్ సోషల్ మీడియా లీక్ లకు కూడా అంతే గొప్ప ఫాలోయింగ్ బయటపడుతోంది. ఈ బ్యూటీ పర్ఫెక్ట్ బికినీ గాళ్ అనేందుకు తాజాగా ఒక లీక్ అందింది. శ్రద్ధా పింక్ బికినీ లుక్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. బీచ్ లో పింక్ టూ-పీస్ లో తన టోన్డ్ బాడీని ప్రదర్శిస్తూ శ్రద్ధా కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోలో రణబీర్ కపూర్ కూడా కనిపించాడు. రణబీర్ - శ్రద్ధా నాయకానాయికలుగా లవ్ రంజన్ దర్శకత్వంలో ఇంకా టైటిల్ నిర్ణయించని రోమ్-కామ్ సెట్స్ నుంచి లీక్డ్ ఫోటో ఇది. షూట్ లొకేషన్ నుండి లీక్డ్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రద్ధా కపూర్ పింక్ బికినీ నెటిజనుల మనసు దోచడంతో ఇప్పుడు ఆ మూవీకి చక్కని ప్రచారం కలిసొస్తోంది.

బాలీవుడ్ లో ఫిట్ గా ఉన్న నటీమణులలో శ్రద్ధా ఒకరు. శ్రద్ధా బికినీ ఫోటోలు ట్విట్టర్ -ఇన్ స్టాగ్రామ్ లో అభిమానుల క్లబ్ లు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి. శ్రద్ధా బోల్డ్ అవతార్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వీడియోలలో ఒకదానిలో రణబీర్- శ్రద్ధా సముద్రంలో షూట్ చేస్తూ కనిపించారు. రణబీర్ చొక్కా లేకుండా కనిపించగా.. శ్రద్ధా తెల్లటి బికినీ ధరించింది. నీటిలో సీన్ లో వేడెక్కించారు. దీనికి ''మరింత ఉత్సాహంగా ఉన్న SK×RK (sic)" అని అభిమానులు వ్యాఖ్యానించారు.

కెరీర్ ఆరంభమే ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ఆషికి 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రద్ధా తరువాత స్త్రీ- హైదర్- స్త్రీ- ఏక్ విలన్- చిచోరే- ABCD: ఏ బాడీ కెన్ డ్యాన్స్ వంటి చిత్రాలలో పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల పెద్ద తెరపై కనిపించి చాలా కాలమైంది. శ్రద్ధ చివరిగా 2020 చిత్రం టైగర్ ష్రాఫ్- రితీష్ దేశ్‌ముఖ్ -అంకితా లోఖండేలతో కలిసి 'బాఘీ 3'లో కనిపించింది. ఇది కాకుండా.. నటి నిఖిల్ ద్వివేది - విశాల్ ఫ్యూరియా 'నాగిన్' లో కూడా భాగం అవుతుంది. ఇది 1989 నాటి స్లాప్ స్టిక్ చిత్రం 'చాల్ బాజ్' కి మోడ్రన్ రీమేక్. శ్రద్ధా తన కెరీర్ లో ఎన్నడూ చూడని అవతార్ లో కనిపిస్తుంది. ఈ చిత్రంలో  ఆకారాన్ని మార్చుకునే పాము పాత్రలో కనిపిస్తుంది.

సోదరునికి హ్యాపీ బర్త్ డే లవ్ రంజన్ చిత్రం షూటింగ్ కోసం శ్రద్ధా కొంతకాలంగా మారిషస్ లో ఉంది.  చివరి షెడ్యూల్ ను పూర్తి చేసిన తర్వాత తిరిగి ముంబైకి తిరిగి వచ్చింది. ఇంతలోనే తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో తన సోదరుడు సిద్ధాంత్ కపూర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన భయ్యా తో ఉన్న ఓ ఫోటోని పంచుకుంటూ దానికి క్యాప్షన్ ఇచ్చింది: ''ఘర్ వాప్సీ + భయ్యా పుట్టినరోజు = సంతోషం. హ్యాపీ బర్త్ డే భయ్యా!!! @సిద్ధాంత్‌కపూర్'' అని వ్యాఖ్యను జోడించింది.

అపూర్వ లఖియా 2017 చిత్రం 'హసీనా పార్కర్'లో శ్రద్ధా - సిద్ధాంత్   అన్నాచెల్లెళ్లుగా నటించారు. శ్రద్ధా టైటిల్ పాత్రను పోషించగా.. తన సోదరుడు గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం పాత్రను పోషించాడు.