సముద్రంలో 'సాగరా'య్ కన్య... టాప్ వ్యూ లో అదుర్స్

Thu Sep 29 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

LaxmiRaii Bikini Pose

హీరోయిన్స్ ఎంత అందంగా ఉన్నా వారి యొక్క ఔట్ ఫిట్.. మేకప్.. కెమెరా మెన్ క్రియేటివిటీ అన్నీ బాగుంటేనే ఆ హీరోయిన్ ఏదైనా స్టిల్ లేదా పోస్టర్ లో అందంగా కనిపిస్తుంది. ఇలా అన్ని కలిసినట్లుగా అనిపిస్తుంది ఈ ఫోటో. అందమైన లొకేషన్.. కళ్లు పెద్దవి చేసి చూడాలనిపించే విధంగా బికినీ.. మంచి టాప్ వ్యూ లో కెమెరా పొజీషన్. ఈ ఫోటో చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే.ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. వాటన్నింటిలోకి ఈ ఫోటో చాలా స్పెషల్ గా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ముద్దుగుమ్మ అందమైన సాగర కన్య మాదిరిగా ఈ ఫోటోలో కనిపిస్తుందని చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

బీచ్ లో ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్ ఫోటో షూట్స్ కొత్తేం కాదు. కానీ ఇలా నీటి మధ్యలో రాయ్ లక్ష్మీని చూస్తూ ఉంటే గుండె జారినంత పనైంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ముద్దుగుమ్మ ఫోటోలు మళ్లీ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ సారి ఇంకాస్త ఎక్కువే అని చెప్పాలి.

అందాల ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ తెలుగు లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించడం మాత్రమే కాకుండా ఐటెం సాంగ్స్ లో నర్తించి మెప్పించింది. ఇక తమిళంలో మరియు హిందీల్లో కూడా ఈ అమ్మడి అందాల ఆరబోతకు ఫ్యాన్స్ ఉన్నారు. హిందీలో వరుసగా సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ముద్దుగుమ్మ ఇలా బికినీ షో తో బాలీవుడ్ ఆఫర్లకు గురి పెట్టినట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.