Begin typing your search above and press return to search.

నవ్వుతోనే మనసులు దోచుకుంటున్న లావణ్యం!!

By:  Tupaki Desk   |   11 July 2020 4:30 PM GMT
నవ్వుతోనే మనసులు దోచుకుంటున్న లావణ్యం!!
X
టాలీవుడ్ 'అందాలరాక్షసి' అంటే గుర్తొచ్చేది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ. మొదటి సినిమాతోనే.. ఏ మంత్రమో అల్లేసిందిలా ఎదకే వేసే సంకెల.. అంటూ తెలుగు కుర్రకారు చేత పాటలు పాడించింది ఈ డెహ్రాడూన్ భామ. ఇక ముంబైలోని రిషి దయారాం నేషనల్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లావణ్య.. టీనేజ్ లోనే మోడలింగ్ కెరీర్ ప్రారంభించింది. లావణ్య బ్యూటీకి గుర్తించి 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ కూడా వరించింది. భరతనాట్యంలో కూడా శిక్షణ తీసుకుందట. అలా మోడలింగ్ లో కమర్షియల్ యాడ్స్ చేస్తున్న టైం.. 2012లో ఫ్రెండ్ చెప్తే ఒక సినిమా ఆడిషన్స్ లో పాల్గొంది. అదృష్టం బాగుండి సెలెక్ట్ అయిపోయింది. ఆ సినిమానే అందాల రాక్షసి. తొలి సినిమాతోనే తన అమాయకత్వంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న లావణ్య.. కెరీర్ ప్రారంభించిన కొద్దికాలంలోనే స్టార్ స్టేటస్ అందుకునేలా కనిపించింది. ఆ తరువాత వరుస పరాజయాలతో ఈ అమ్మడు కాస్త వెనుక పడిపోయింది.

ఏ మాటకి ఆ మాట మొదట్లో లావణ్యను చూసిన ప్రతీ ఒక్కరూ అచ్చ తెలుగమ్మయా.. అనే సందిగ్ధంలో పడ్డారు. ఆ కట్టు బొట్టు లుక్కు.. అన్నీ తెలుగమ్మాయిలాగే ఉన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా మూలంగా ఇంటి పట్టునే ఉంటున్న ఈ భామ.. ఇటీవలే అర్జున్ సురవరం సినిమాతో డీసెంట్ హిట్ అందుకుంది. అయితే ఈ టైంలో ఖాళీగా ఉండకుండా సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తుంది. ఇటీవలే ఓ ఫోటో పోస్ట్ చేసింది అమ్మడు. ఆ ఫోటో చూడ్డానికి మాములుగానే ఉన్నా.. అమ్మడి అందాలన్నీ ఉట్టిపడుతున్నాయి. స్కర్ట్ ధరించి సింపుల్ స్మైల్ ఇచ్చింది లావణ్య. అంతే ఆ నవ్వుకే కుర్ర గుండెలు ఫిదా అయిపోతున్నాయి. అలా నవ్వుతూ లివింగ్ రూంలో కూర్చున్న పోజు భలే ఉందని అనిపిస్తుంది. పిల్లోలో కూర్చొని ఈ గుమ్మ నిజంగానే ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం లావణ్య చేతిలో చావు కబురు చల్లగా.. ఏ1 ఎక్సప్రెస్.. సినిమాలు ఉన్నాయట.