Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : నేచురల్‌ బ్యూటీ 'అందాల రాక్షసి'

By:  Tupaki Desk   |   6 Jun 2023 12:01 PM GMT
పిక్ టాక్‌ : నేచురల్‌ బ్యూటీ అందాల రాక్షసి
X
అందాల రాక్షసి సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. కెరీర్‌ ఆరంభంలో వరుస సినిమాలు చేసిన లావణ్య త్రిపాఠి ఈమధ్య కాలంలో జోరు కాస్త తగ్గింది. చిన్నా చితక సినిమాల్లో ఆఫర్లు వస్తుండటంతో ఈమె మంచి సినిమాలు మాత్రమే చేయాలనే ఉద్దేశ్యంతో పలు ఆఫర్లకు నో చెబుతుందట.

కెరీర్‌ ఆరంభం నుండి కూడా స్కిన్‌ షో విషయంలో ఇతర హీరోయిన్స్ కంటే కాస్త తక్కువే అని చెప్పాలి. అయితే స్కిన్ షో చేయకున్నా కూడా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి.

క్యూట్ గా చూడగానే పక్కింటి అమ్మాయి అన్నట్లుగా నేచురల్‌ గా ఈ అందాల రాక్షసి ఉంటుందని అభిమానులు అంటూ ఉంటారు. తాజాగా షేర్ చేసిన ఫోటోలు కూడా అలాగే ఉన్నాయి. చాలా నేచురల్‌ గా ఈ ఫోటోల్లో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ మరియు అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక లావణ్య త్రిపాఠి త్వరలో మెగా బ్రదర్‌ నాగబాబు ఇంటి కోడలు కాబోతుంది అంటూ తెగ ప్రచారం జరుగుతోంది. రాబోయే మూడు నాలుగు రోజుల్లోనే వివాహ నిశ్చితార్థం జరగబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి స్పష్టత రాలేదు. కానీ వార్తలు మాత్రం చాలా బలంగా వినిపిస్తున్నాయి.