Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్ చెప్పిందే నిజం చేసిన లావణ్య..!

By:  Tupaki Desk   |   10 Jun 2023 1:13 PM GMT
అల్లు అరవింద్ చెప్పిందే నిజం చేసిన లావణ్య..!
X
టాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా, వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు చెక్కర్లు కొడుతున్నాయి. వీరు ప్రేమించుకుంటున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా, వారు స్పందించలేదు. తాజాగా ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసి వారి ప్రేమను తెలియజేశారు.

వరుణ్, లావణ్య ఇద్దరూ ఒకేలాంటి ఫోటోలు షేర్ చేశారు. తనకు తన ప్రేమ దొరికింది అంటూ వరుణ్ క్యాప్షన్ పెట్టగా, తమ ప్రేమ 2016 లోనే మొదలైందని.. చివరి వరకు ఉంటుందని అంటూ లావణ్య క్యాప్షన్ పెట్టింది. దీంతో, ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా, లావణ్య కు సంబంధించిన ఓ పాత వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. అది ఆమె మూవి ప్రీరిలీజ్ కి సంబంధించిన వీడియో కావడం గమనార్హం. అందులో అల్లు అరవింద్ మాట్లాడుతున్నాడు. లావణ్య తెలుగు చాలా చక్కగా తెలుగు మాట్లాడుతోందని, ఇక్కడి అబ్బాయినే పెళ్లిచేసుకొని సెటిల్ అయితే బెటర్ అని అన్నాడు. అయితే, ఇప్పుడు లావణ్య అదే నిజం చేసింది అంటూ నెటిజన్లు కామెంట్ చేయడం విశేషం. అదే నిజం చేయడమే కాదు, ఏకంగా వాళ్ల ఇంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా కుటుంబసభ్యుల మధ్య జరిగింది. మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైనట్లు తెలుస్తోంది. కాగా, వరుణ్,లావణ్య లు చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటన్నా, ఎక్కడ బయటకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడటం విశేషం.

కాగా, వరుణ్, లావణ్యలకు మిస్టర్ మూవీ సమయంలో పరిచయం ఏర్పడింది. 2016లొ తెరకెక్కిన ఈ సినిమా కి శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ సమయం లోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఇక లావణ్య ఉత్తరప్రదేశ్ కి చెందిన యువతి కాగా, అందాల రాక్షసి సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి... ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో 'గాంఢీవదారి అర్జున'. మరొకటి... ఏవియేషన్ థ్రిల్లర్. దానిని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం బుడాపెస్ట్ సిటీలో ప్రవీణ్ సత్తారు యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ చేస్తున్నారు.