`సలార్` ఇంటర్వెల్ బ్యాంగ్ `ధూమ్ 3` రేంజులో!?

Wed Jul 21 2021 11:26:28 GMT+0530 (IST)

Latest update on salary interval fight

ప్రస్తుతం అన్ లిమిటెడ్ బడ్జెట్లతో పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. 300- 500 కోట్ల మధ్య బడ్జెట్ పెట్టేందుకు సౌత్ లో నిర్మాతలు వెనకాడడం లేదు. బహుభాషల్లో ఈ ఫార్మాట్ పెద్ద స్థాయి లాభాల్ని అందిస్తుండడంతో ఇలాంటి రిస్క్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.అయితే అంత రిస్క్ చేసేప్పుడు ఎంచుకునే కంటెంట్ లో దమ్ము కూడా అలానే ఉండాలి. దర్శకుడు పాన్ ఇండియా సినిమాల్ని యూనివర్శల్ యాక్సెప్టెన్సీతో తెరపై  ఆవిష్కరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సినిమాకి క్లైమాక్స్ ఎంత ముఖ్యమో తొలి అర్థగంటలోనే ఆడియెన్ ని పూర్తిగా కథ పరంగా ట్రావెలింగ్ లోకి తీసుకెళ్లగలగడం అంతే ముఖ్యం. ఆ సమయంలో అసహనానికి గురైతే ఇక అంతే సంగతి. మూవీలో ప్రీఇంటర్వెల్ ట్విస్టు.. ఇంటర్వెల బ్యాంగ్ ఆడియెన్ ని కుర్చీ అంచుకు చేరుకునేంతగా థ్రిల్ కి గురి చేయాలి. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ వరకూ కళ్లప్పగించి చూసేంత ఎగ్జయిట్ మెంట్ ని తెరపై ఆవిష్కరించాలి.

బాలీవుడ్ లో ధూమ్ ఫ్రాంఛైజీ సినిమాలు రేస్ ఫ్రాంఛైజీ సినిమాల ఘనవిజయం వెనక ఇలాంటి ఎగ్జయిటింగ్ ఎలిమెంట్స్ ఎన్నయినా చూడొచ్చు. ఇక మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3 సంచలన విజయం సాధించడం వెనక ఆ మూవీలో ఎన్నో రకాల ఎలిమెంట్స్ సాయమయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా ధూమ్ 3 ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్టును అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అప్పటివరకూ అమీర్ ఖాన్ ఒకరే అనుకునే ఆడియెన్ కి సడెన్ గా ట్విస్ట్ ఎలివేట్ అవుతుంది. అతడు ట్విన్ బ్రదర్స్ లో ఒకడు అని తెలుస్తుంది. అమీర్ అసాధారణ సర్కస్ ఫీట్ల వెనక ద్విపాత్రల్ని ఓపెన్ చేసిన తీరు ఆద్యంతం ఉత్కంఠను పెంచుతుంది.

ఇప్పుడు సలార్ చిత్రానికి కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ అదే తరహాలో అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ ని ఇవ్వనున్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఇది మాఫియా కథాంశం. డాన్ లు కాప్ లతో సావాసం. కథ పరంగా ఎన్నో ఎగ్జయిటింగ్ ఎలిమెంట్స్ ఉండనున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. సలార్ షూటింగ్ కొత్త షెడ్యూల్ త్వరలో RFC లో ప్రారంభమవుతుంది. దీనికోసం ప్రత్యేక సెట్లు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీ ఇంటర్వెల్ బ్లాక్ ఈ సెట్లలోనే చిత్రీకరిస్తారు. రెండు వారాల కంటే ఎక్కువ కాలం చిత్రీకరణ సాగనుంది. దీనికోసం చాలా కాలంగా చాలా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక ఇప్పటికే ఈ మూవీలో విజువల్ ట్రీట్ ఇచ్చే క్రేజీ ఎలివేషన్స్ తో  ఫైట్ సీక్వెన్సులను రూపొందించారు. తాజా షెడ్యూల్స్ లో వందలాది జూనియర్ ఆర్టిస్టులు యాక్షన్ సీక్వెన్సుల్లో పాల్గొననున్నారు. ఇక శ్రుతిహాసన్ ఈ షెడ్యూల్ లో చేరతారా లేదా అన్నది ఇంకా చెప్పలేం.

ఓవైపు `ఆదిపురుష్ 3డి` చిత్రీకరణతో బిజీగా ఉన్న ప్రభాస్ మరోవైపు సలార్ షెడ్యూల్స్ కోసం అటూ ఇటూ షఫుల్ అవుతున్నారు. ఇరు సినిమాల సెట్లలో అతడు సందడి చేస్తున్నారు. అందుకు తగ్గట్టు తన రూపాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. సలార్.. ఆదిపురుష్ 3డి ఒకేసారి తెరకెక్కనుండడంతో లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. సలార్ లో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా ఆదిపురుష్ 3డిలో కృతి సనోన్ కథానాయికగా నటిస్తుండడం ఆసక్తికరం. ఈ ఇద్దరు ముద్దుగుమ్మల నడుమ అభినయం పరంగా పోటీ అనివార్యం. సలార్ లో శ్రుతి అల్ట్రా మోడ్రన్ గాళ్ గా యాక్షన్ మోడ్ లో కనిపించనుండగా కృతి సనోన్ సాంప్రదాయ కట్టు బొట్టుతో సీతాదేవిగా కనిపించనున్నారు.