కీర్తి సురేష్ కొత్త సినిమా టీజర్.. ఎక్కడో చూసినట్టుందే!

Sun May 29 2022 11:15:53 GMT+0530 (IST)

Keerthi Suresh Vaashi Movie Treaser Out Now

మహానటి కీర్తి సురేష్ ఇటీవల తెలుగులో సర్కారు వారి పాట సినిమా తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ తెలుగులో కాస్త స్పీడ్ తగ్గించినప్పటికీ మిగతా భాషల్లో మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక మలయాళంలో టోవినో థామస్ తో కలిసి నటించిన 'వాషి' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. విష్ణు జి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తి చేసుకుంది.కీర్తి సురేష్ - టోవినో థామస్ మొదటిసారి కలిసి నటించడంతో సినిమా కోసం మలయాళం ఇండస్ట్రీలోని ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు కూడా ఈ చిత్రంలో లాయర్ల పాత్రలో కనిపించనున్నారు.  ఒక బలమైన కేసులో ప్రేమించుకున్నవారే పోటీ పడి వాదిస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ అని టీజర్ చూస్తే అర్థమైంది. ఇక ఈ టీజర్ చూస్తుంటే అప్పుడెప్పుడో వచ్చిన మన రాధా గోపాళం సినిమా గుర్తు రాకుండా ఉండదు.

2005లో బాపు దర్శకత్వంలో వచ్చిన రాధా గోపాళం సినిమాలో శ్రీకాంత్ స్నేహ ఇద్దరు కూడా ఇంట్లో దంపతులుగా కోర్టులో ప్రొఫెషినల్ లాయర్లు గా ఒక కేసును వాదిస్తారు. ఇక వాషి సినిమా కాస్త డిఫరెంట్ ఎమోషన్స్ తో తెరకెక్కుతునప్పటికి అసలు పాయింట్ అదే అని క్లారిటీగా అర్థమవుతోంది.  

ఇదిలా ఉంటే ఈ సినిమా ఈ ఏడాది జూన్ 17న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.  రేవతి క్లామండిర్ - జి సురేష్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ లో మలయాళం ప్రముఖ నటులు కొట్టాయం రమేష్ మాయా విశ్వనాథ్ మాయా మీనన్ బైజు నందు కూడా  కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక మరోవైపు కీర్తి తమిళంలో ఒక సినిమా చేస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ లో చెల్లెలి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నాని దసర మూవీలో కూడా మేయిన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్న కీర్తి సురేష్ త్వరలోనే మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.