Begin typing your search above and press return to search.

వీడియో : ఆర్‌ఆర్ఆర్‌ స్టార్‌ 'డార్లింగ్స్‌' ఫుల్ క్లారిటీ

By:  Tupaki Desk   |   5 July 2022 9:30 AM GMT
వీడియో : ఆర్‌ఆర్ఆర్‌ స్టార్‌ డార్లింగ్స్‌ ఫుల్ క్లారిటీ
X
బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌ ఇటీవలే ఆర్ ఆర్ ఆర్‌ మరియు గంగూభాయ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది.

అయితే ఆ సినిమాలో ఆలియా పోషించిన సీత పాత్ర నిడివి చాలా తక్కువ ఉంది అంటూ ఆమె అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. గంగు భాయ్ సినిమా ఆమె అభిమానులకు ఫుల్ మీల్స్ గా నిలిచింది.

గంగూభాయ్ సినిమా తో మరింతగా తన స్టార్ డమ్‌ ను పెంచుకున్న ముద్దుగుమ్మ ఆలియా భట్ త్వరలోనే డార్లింగ్స్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదట ఈ సినిమాను థియేట్రికల్‌ రిలీజ్ కు ప్లాన్ చేయడం జరిగింది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేసేందుకు సిద్దం అయ్యారు. ఆ విషయం అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్‌ వారు ఈ సినిమాను ఆగస్టు 5వ తారీకున స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. సినిమాకు సంబంధించిన టీజర్‌ ను కూడా నెట్‌ ఫ్లిక్స్ అధికారికంగా విడుదల చేసి సినిమాపై అంచనాలు మరియు ఆసక్తి పెంచారు. హీరోయిన్ గా ఆలియా భట్ కు ఈ సినిమా మరింత హైప్ తీసుకు వస్తుందని టీజర్‌ ను చూస్తుంటే అనిపిస్తుంది.

షెఫాలి షా.. విజయ్‌ వర్మ.. రోషన్ మాథ్వే ఇంకా పలువురు ప్రముఖ నటీ నటులు నటించిన డార్లింగ్స్ టీజర్‌ చూస్తుంటే సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్‌ స్టోరీ తో సాగుతుందని తెలుస్తోంది. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను త్వరలో విడుదల చేయబోతున్నారు.

అంతే కాకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఈ నెల మూడవ వారంలో మొదలు పెట్టబోతున్నారట. ఆలియా భట్ లుక్ మరియు ఆమె నటన ఖచ్చితంగా డార్లింగ్స్ కు ప్రత్యేక ఆకర్షణ అవుతుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.