దర్శకులందరికి శర్వానే కావాలంటే ఎలా

Mon Jun 10 2019 11:50:54 GMT+0530 (IST)

Latest Rumours On Sharwanand Future Movies

వచ్చిన ప్రతి ఆఫర్ ని ఒప్పేసుకుని వరసబెట్టి చేసుంటే శర్వానంద్ సినిమాలు ఎంతలేదన్నా ఏడాదికి మూడు లేదా నాలుగు వచ్చేవి. క్వాంటిటీ కన్నా క్వాలిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని చెప్పే శర్వా ప్రస్తుతం రణరంగం ఫినిష్ చేసి ఆగస్ట్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. గ్యాంగ్ స్టర్ గా శర్వా లుక్ కి అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి సైతం ఫీడ్ బ్యాక్ బాగుంది.దీని తర్వాత సమంతా కలిసి తమిళ్ బ్లాక్ బస్టర్ 96 రీమేక్ షూటింగ్ లో శర్వా జాయిన్ కానున్నాడు. ఇంకొద్ది రోజుల్లో ఇది రెగ్యులర్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా శర్వానంద్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటూ రకరకాల కాంబినేషన్లు ప్రచారంలోకి రావడం అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇప్పటికే చందు మొండేటి పేరు ఓసారి వినిపించింది. కానీ అది కార్యరూపం దాల్చడంలో ఆలస్యం జరిగింది. ఇప్పటికైతే ఎలాంటి సమాచారం లేదు. తర్వాత శ్రీరామ్ ఆదిత్య ఓ కథను శర్వా కోసం సిద్ధం చేశానని చెప్పాడు. కానీ తీరా చూస్తే అతను గల్లా అశోక్ తో కమిట్ అయ్యాడు. ఒకవేళ శర్వాతో ఫ్యూచర్ లో ప్లాన్ చేయొచ్చేమో కానీ ఇప్పటికైతే లేనట్టే.

శ్రీకాంత్ అడ్డాల సైతం తన కంబ్యాక్ కోసం శర్వాని దృష్టిలో పెట్టుకుని మంచి కథ సిద్ధం చేశాడని టాక్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా రాజు సుందరం లైన్లోకి వచ్చాడు. పదకొండేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళి దర్శకుడిగా శర్వా మూవీతోనే డైరెక్టర్ గా రీ స్టార్ట్ అవుతారని ప్రచారమవుతోంది. ఇదీ అఫీషియల్ నోట్ వచ్చే వరకు నమ్మలేని పరిస్థితి. చూస్తుంటే ప్రతి దర్శకుడు బెస్ట్ ఛాయస్ గా శర్వానంద్ ను దృష్టిలో పెట్టుకునే కథలు సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ శర్వానంద్ మనసులో ఎవరు ఉన్నారో