Begin typing your search above and press return to search.

లేటెస్ట్ పిక్.. మహేష్ బాబు స్వాగ్ లుక్

By:  Tupaki Desk   |   9 Dec 2022 6:47 AM GMT
లేటెస్ట్ పిక్.. మహేష్ బాబు స్వాగ్ లుక్
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత కూల్ గా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు తన స్టైల్ యాటిట్యూడ్ తో మాత్రం డిఫరెంట్ గా ఆకట్టుకుంటూ ఉంటారు. ఎంత మాత్రం పొగరు చూపించరు కానీ స్వాగ్ అనే టైటిల్ మాత్రం ఆయనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇక సూపర్ స్టార్ హోదా అందుకున్న మహేష్ బాబు ఎలాంటి ఫోటోకు ఫోజులు ఇచ్చిన కూడా అందులో నాచురల్ గా ఉంటూనే మరోవైపు ట్రెండిగా కూడా కనిపిస్తూ ఉంటారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తన జిమ్ ట్రైనర్ తో కలిసి ఇచ్చిన ఒక స్టిల్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెనకాల మహేష్ బాబు స్టైలిష్ లుక్కుతో కనిపిస్తున్నారు.

గతంలో ఇలాంటి స్టిల్స్ చాలానే ఇచ్చినప్పటికీ మహేష్ బాబు ఇందులో మాత్రం నెవర్ బిఫోర్ అనేలా కనిపిస్తున్నాడు. మొత్తానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు లుక్ చాలా కొత్తగా ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది.

ఇక త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్న మహేష్ బాబు వీలైనంత తొందరగా ఆ ప్రాజెక్టును ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఇదివరకే ఒక స్క్రిప్ట్ అనుకొని మొదటి షెడ్యూల్ కూడా ఫినిష్ చేసినప్పటికీ మళ్లీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.

పూర్తిస్థాయిలో నమ్మకంగా అనిపించే వరకు మహేష్ ప్రాజెక్టులను పూర్తి చేయకూడదు అని అనుకుంటున్నాడు. ఇక 28వ ప్రాజెక్ట్ విషయంలో ఆయన మరింత సీరియస్గా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోంది.

ఎందుకంటే తదుపరి సినిమా రాజమౌళితో చేయాల్సి ఉంది. ఆ సినిమా ఫ్యాన్ ఇండియా కంటే హై రేంజ్ లో ఫ్యాన్ వరల్డ్ సినిమాగా తీసుకురావాలి అని అనుకుంటున్నారు. అందుకే మహేష్ బాబు అంతకు ముందు వచ్చే సినిమా కాబట్టి మినిమం హై రేంజ్ లో ఉండాలి అనే ఆలోచన చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు ఆలోచనలకు తగ్గట్టుగానే ప్రాజెక్టును రెడీ చేస్తున్నాడు. త్వరలోనే మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయాలని కూడా ఒక ప్లాన్ అయితే సెట్ చేసుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.