రాశిఖన్నా.. స్పీడ్ మాములుగా లేదు!

Sun May 29 2022 11:12:51 GMT+0530 (IST)

Latest News Rashikhanna New Movies

గ్లామర్ బ్యూటీ రాశిఖన్నా చాలా ఏళ్ళుగా సినిమా పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు అయితే అందుకుంటోంది. కానీ ఇంకా అనుకున్నంత రేంజ్ లో స్టార్ హోదా ను అందుకోవడం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బ్యూటీ సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా ఇటు సౌత్ లోనూ అటు నర్త్ ఇండస్ట్రీలోనూ అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది. కేవలం సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్ ల తో కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరవుతోంది.ఇక త్వరలోనే ఈ బ్యూటీ ఫార్జి అనే మరొక భిన్నమైన వెబ్ సీరీస్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అమెజాన్ ప్రైమ్ లో రానుంమ ఫార్జి భారీ తారాగణంతో విభిన్నమైన వెబ్ ప్రాజెక్ట్ గా రెడీ అవుతోంది.  క్రైమ్ థ్రిల్లర్ గా రాజ్ నిధిమోర్ కృష్ణ DK ఈ వెబ్ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రధాన పాత్రలో నటించగా మరొక ముఖ్యమైన పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు.

ఇక రాశి కన్నా కూడా ప్రాజెక్టులు కీలకమైన పాత్రలో నటించింది. కాబట్టి ఈ ఈ వెబ్ సిరీస్ ఫైన రాశిఖన్నా చాలా ఆశలు పెట్టుకుంది. తప్పకుండా మంచి గుర్తింపుని అందుకుని నార్త్ సైడ్ కూడా ఇంకా మరిన్ని అవకాశాలు అందుకోవాలని అనుకుంటుంది.

రీసెంట్గా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టింది. అందుకు సంబంధించిన ప్రత్యేకమైన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వెబ్ సీరీస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా వివరణ ఇచ్చింది.

ఫార్జి వెబ్ సిరీస్ లో కొంత మంది బాలీవుడ్ నటీమణులు కూడా రాశికన్నా తో పోటీపడి నటించినట్లు తెలుస్తోంది. రెజినా కాసాండ్రా కూడా ఈ ప్రాజెక్టులో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించింది. ఇక రాశి ఖన్నా తెలుగులో నాగచైతన్య థాంక్యూ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఆ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది  అంతేకాకుండా ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం ఒక నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక మరికొన్ని చర్చల దశలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.