Begin typing your search above and press return to search.

లింగ వివ‌క్ష‌పై 'లైగ‌ర్' భామ రుస‌రుస‌లు!

By:  Tupaki Desk   |   5 April 2022 11:30 PM GMT
లింగ వివ‌క్ష‌పై లైగ‌ర్ భామ రుస‌రుస‌లు!
X
ఇండ‌స్ర్టీలో లింగ వివ‌క్ష‌పై ఎప్ప‌టిక‌ప్పుడు న‌టీమ‌ణులు గ‌ళ మెత్తుతూనే ఉంటారు. హీరోల చిత్రాల‌కు ఉన్న క్రేజ్ లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌కు ఉండ‌ద‌ని..ఇది క‌చ్చితంగా లింగ వివ‌క్ష‌లో భాగమంటూ ఇప్ప‌టికే కొంత మంది బాలీవుడ్ హీరోయిన్లు బ‌హిరంగానే వ్య‌తిరేకించారు. నిజ‌మే హీరోల చిత్రాల‌కు ఉన్నంత మైలేజ్ హీరోయిన్ ఓరియేండెట్ చిత్రాల‌కు ఉండ‌ద‌న్న‌ది వాస్త‌వం.

దీనికి ఇండస్ర్టీ కార‌ణం ఒక్క‌టే కాదు. ఇక్క‌డ ద‌ర్శ‌కుడిని అనుకోవ‌డానికి ఆస్కారం లేదు. ఈ విష‌యంలో ప్ర‌ధాన పాత్ర పోషించేది స‌మాజం అన్నది వాస్త‌వంగా గుర్తించాల్సిన అంశం. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు స‌క్సెస్ అవ్వాలంటే హీరోల కు ధీటుగా ఇమేజ్ ని క‌ల్గి ఉండాలి. అయినా ఆ క్రేజ్ ఎంతో కాలం ఉండ‌దు. చాలా ప‌రిమింతంగానే హీరోయిన్ల వృత్తి జీవితం కొన‌సాగుతుంది. హీరోల‌తో పోల్చితే హీరోయిన్ల‌కు లైఫ్ త‌క్కువ అన్న‌ది తెలిసిందే.

ఈ విష‌యంలో ఆడియ‌న్ ఆలోచ‌న‌లో సైతం మార్పులొస్తే త‌ప్ప వివ‌క్ష అన్న‌ది తొల‌గిపోని అంశంగానే మిగిలిపోతుంది. లింగ వివ‌క్ష‌పై దీపికా ప‌దుకొణే..కంగ‌నా ర‌నౌత్ లాంటి వారు ఇప్ప‌టికే చాలాసార్లు మీడియా ముఖంగా స్పందించారు. దీనికి ర‌క‌ర‌కాల కార‌ణాల్ని సైతం విశ్లేషించారు. కొన్ని రోజుల క్రితం నటి తాప్సీనటీనటుల చిత్రాలను చూడటానికి ప్రేక్షకులు పరిగెత్తుకు వస్తారు కానీ నటీమణుల చిత్రాలను చూడ‌టానికి అంత ఆస‌క్తి చూపించ‌ర‌న్నారు.

ప్రేక్ష‌కులు ఎప్ప‌టినుంచో ఇదే విధానికి అల‌వాటు ప‌డిపోయి ఉన్నారు. అందులో మార్పులు వ‌స్తే త‌ప్ప వివ‌క్ష తొల‌గిపోదు అని అభిప్రాయ‌ప‌డ్డారు. తాజాగా యంగ్ హీరోయిన్ అన‌న్య పాండే కూడా ఇదే విష‌యంపై స్పందించింది. నటీమణులు అభిరుచితో ఏదైనా కొత్త ప్ర‌య‌త్నం చేసినా ప్రోత్స‌హించ‌డానికి ప్రేక్ష‌కులు ముందుకు రావ‌డం లేదు.

అదే ఒక న‌టుడు అలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తే బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నారు. ఎందుకింత వ్య‌త్యాసం? ఒక నటుడు నటించినా...చెడ్డ పాత్ర చేసినా మార్కెట్ లో చెల్లిపోతుంది. సినిమా రంగంలో హీరోయిన్ కేవలం కొంత వ‌ర‌కే ప‌రిమితం అవుతుంది అన్న భావ‌న‌ని అన‌న్య బ‌య‌ట‌పెట్టింది.

'లైగర్' సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భామ విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తుంది. తెలుగు..హిందీ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కించారు. ధర్మ ప్రొడక్షన్స్-పూరి కనెక్స్ట్ సంయుక్తంగా నిర్మించాయి. బాలీవుడ్ లో చుంకీపాండే వారసురాలిగా అనన్య పాండే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రెండు..మూడు సినిమాల్లో నటించింది. ఇటీవలే విడుదలైన 'గెహ్రాయాన్' లో నూ అనన్య నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులు అందుకుంటూ యువ భామగా వెలిగిపోతుంది.