నెట్ లో చిక్కి లారిస్సా అందం విలవిల

Wed Jan 19 2022 14:01:08 GMT+0530 (IST)

Larissa Bonesi Latest Photoshoot

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు..ఆనందంగా గడపడానికి కావాలొక దీవి ..సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు.. శని ఆదివారాల్లో మరి అన్నవి ఓహొ
మనుషుల్ని మిషన్లు కావద్దన్నవి... చంపే సైన్యం అణూయుధం ఆకలి పస్తులూ డర్టీ పాలిటిక్స్...సొల్యూషన్ ఏదీ చొరబడలేని దీవి కావాలి ఇస్తావా ..కొలంబస్...శంకర్- జీన్స్ సినిమాలోనిది ఈ పాట. ఏ.ఆర్.రెహమాన్ బాణీలో మెరుపులు ఉరుముల్ని అంత తేలిగ్గా సినీఅభిమానులు మర్చిపోలేరు. ఇక ఇవే మెరుపులు ఉరుములు చూపించే ట్యాలెంట్ టాప్ మోడల్ కం నటి లారిస్సా బోనెస్సీలో ఉన్నాయి. ఈ భామ బీచ్ లో మెరిపించినా.. లేదా పబ్లిక్ అటెన్షన్ కోసం వీధుల్లో మెరిపించినా ప్రతిదీ హైలైట్ అవుతూనే ఉన్నాయి.

ఇన్ స్టా మాధ్యమంలో నిరంతరం లారిస్సా ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతర్జాలంలో భారీ ఫాలోయింగ్ సంపాదిస్తున్న నాయికగా పాపులరవుతోంది. సాయి ధరమ్ తేజ్ సరసన తిక్కలో నటించాక తెలుగులో ఏమంత అవకాశాల్లేవు కానీ హిందీలో వెబ్ సిరీస్ లు ప్రకటనల్లో నటిస్తూ బిజీగానే ఆర్జిస్తోంది. విదేశీ మోడల్ తెలుగులోనూ స్టార్ అవ్వాలని కలలు గంటోంది. అందుకే నిరంతరం తెలుగు అభిమానులకు తెలుగు సినీపరిశ్రమకు టచ్ లో ఉండేందుకు వరుస ఫోటోలను షేర్ చేస్తోంది. అవన్నీ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా లారిస్సా షేర్ చేసిన నెట్టెడ్ డిజైనర్ టాప్ మిరుమిట్లు యూత్ లో హాట్ట టాపిక్ గా మారాయి.