లాల్ సింగ్ 'చెత్త' రికార్డు!

Sun Aug 14 2022 21:00:01 GMT+0530 (IST)

Lal Singh Chadha Collections

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద మినిమం కలెక్షన్స్ అయితే వచ్చేవి. గత 13 ఏళ్ల కాలంలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన ప్రతి సినిమాతో కూడా 20 కోట్లకు పైగానే ఓపెనింగ్స్ అందుకొనేవాడు. అతని ప్లాప్ సినిమా కూడా అంతకంటే ఎక్కువ వసూళ్లను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చివరగా వచ్చిన థంగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు 50 కోట్లకు పైగా వసూలను అందుకుంది.



కానీ రీసెంట్ గా వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమా మాత్రం అంతకంటే తక్కువగా మొదటి రోజు 11 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. ఒక విధంగా తెలుగు పాన్ ఇండియా సినిమాల కంటే అది చాలా తక్కువ.

కనీసం హిందీలో RRR KGF 2 మొదటి రోజు కలెక్షన్స్ లో సగం కూడా లాల్ సింగ్ అందుకోలేకపోయాడు  అయితే వీకెండ్ పరంగా చూస్తే అమీర్ ఖాన్ కెరీర్ లోనే మరొక చెత్త రికార్డు నమోదయింది.

శనివారం వరకు కూడా లాల్ సింగ్ సినిమా అసలు ఏమాత్రం ఊహించని విధంగా కేవలం 22 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సొంతం చేసుకుంది. హాలిడే సీజన్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడం వలన ఏమాత్రం వర్కౌట్ కాలేదు.

శనివారం అయితే కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఆదివారం బుకింగ్స్ కూడా అంతగా మెరుగ్గా ఏమీ లేవు. ఇక సోమవారం హాలిడే ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే లేదు.

ఈ విధంగా చూసుకుంటే లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం అమీర్ ఖాన్ పడిన కృషి మొత్తం నేల పాలైపోయింది. ఆమిర్ కష్టంతోపాటు సినిమాపై పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయినట్లే లెక్క. అనవసరంగా రీమేక్ లో మార్పులు చేసి ఫ్లాప్ టాక్ అందుకోవడమే కాకుండా ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఫైనల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా ఇలాంటి దారుణమైన రికార్డులను అందుకుంటుందో చూడాలి.