అదే జరిగితే లాల్ సింగ్..రక్షాబంధన్ పరువు కూడా పోయినట్లే?

Fri Aug 12 2022 17:03:54 GMT+0530 (IST)

Lal Singh Chaddha Raksha Bandan

బాలీవుడ్ కి మరోసారి భంగపాటు తప్పలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన రెండు చిత్రాలు 'లాల్ సింగ్ చడ్డా'.. 'రక్షాబంధన్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బకొట్టాయి. ఇది బాలీవుడ్ కి ఊహించని షాక్ అని చెప్పాలి. ఈ రెండు చిత్రాలు ఎలాగైనా గత వైభవాన్ని తీసుకొస్తాయని బాలీవుడ్  ఇండస్ర్టీ గంపెడు ఆశలు పెట్టుకుంది.కానీ అన్నింటిని రెండు చిత్రాలు తల్లకిందులు చేసేసాయి.  ఫలితం విషయంలో ఒకదానికి ఒకటి పోటీ పడి మరి పరాజయం చెందినట్లు  కనిపిస్తుంది. 180 కోట్ల  బడ్జెట్ తో తెరకెక్కిన 'లాల్ సింగ్ మొదటి రోజు 12 కోట్లు తేవడం అంటే?  బాలీవుడ్ పరిశ్రమకే అవమానంగా భావించాలేమో.  సినిమాకొచ్చిన నెగిటివ్ రివ్యూలు సహా అమీర్  గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన సినిమాల్ని బ్యాన్ చేయాలి? అన్న అంశం స్పష్టంగా సినిమాపై కనిపిస్తుంది.

ఎప్పుడో జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని లాల్ సింగ్ పై కక్ష తీర్చుకున్నారు. తొలి రోజే లాల్ సింగ్ థియేటర్లు అన్ని వెలవెలబోయాయి. ఆక్యుపెన్సీ 10-20 శాతమే కనిపించింది. అమీర్ లాంటి హీరో ఎలాంటి కథలో నటించినా అతని ఇమేజ్ తో తొలిరోజే 50 కో ట్లు పైగా తేగల సత్తా ఉన్న నటుడు. కానీ లాల్ సింగ్ 12 కోట్లు తెచ్చిందంటే  అమీర్ పై నెగిటివ్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో పడిందో అద్దం పడుతుంది.

ఇక అక్షయ్ కుమార్ నటించిన 'రక్షాంబంధన్' 70 కోట్లతో నిర్మించగా మొదటి రోజు 8.20 కోట్లు తెచ్చిందంటే?  సినిమా డ్యామేజ్ ని అంచానా వేయోచ్చు. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు నువ్వా?  నేనా ?అన్న తీరున పోటీ పడి మరీ వసూళ్లని సాధించాయని తెలుస్తుంది. మరి ఇప్పుడీ రెండు సినిమాల పరువు ..ప్రతిష్టలు 'లైగర్' ఫలితంపై ఆధారపడి ఉన్నాయా? అంటే అవుననే చెబుతుంది తాజా సన్నివేశం.

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'లైగర్' ఆగస్ట్ 25న రిలీజ్ అవుతుంది. మిగతా హిందీ సినిమాల సంగతి పక్కనబెడితే 'లైగర్' భారీ హైప్ తో రిలీజ్ అవుతుంది. హిందీలో విజయ్ కి డబ్యూ మూవీ ఇది. అయినా యంగ్ హీరోకి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా కరణ్ జోహార్ నిర్మాత భాగస్వామి.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ లోనూ మంచి అంచనాలతో 'లైగర్' రిలీజ్ అవుతుంది.

అయితే 'లైగర్' హిందీలో తొలిరోజు లాల్ సింగ్..రక్షాబంధన్ మించి వసూళ్లను తేస్తే మాత్రం  వాటి పరువు ప్రతిష్టలు  కూడా గంగలో కలిసిపోయినట్లే. ఓ యంగ్ హీరో వచ్చి ఇద్దరు సూపర్ స్టార్లని  బీట్ చేసాడని సెటైర్లు తప్పవు. తీవ్ర  స్థాయిలో ఆ ఇద్దరు హీరోలు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి వీటి నుంచి ఆ రెండు చిత్రాలు బయట పడాలేంట 'లైగర్' ఆ లెక్కలు క్రాస్ చేయకూడదు. కానీ విజయ్ క్రేజ్ నేపథ్యంలో ఇది కష్టతరమైన అంశమే అన్నది ట్రేడ్ మాట.