Begin typing your search above and press return to search.

#ద‌స‌రా ప్ర‌క‌ట‌న‌.. OTT కాదు థియేట‌ర్లే ల‌క్ష్యం

By:  Tupaki Desk   |   15 Oct 2021 7:19 AM GMT
#ద‌స‌రా ప్ర‌క‌ట‌న‌.. OTT కాదు థియేట‌ర్లే ల‌క్ష్యం
X
నాగశౌర్య క‌థానాయ‌కుడిగా నటించిన `లక్ష్య` నవంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రేజీ స్పోర్ట్స్ డ్రామాలో నాగ శౌర్య ఆర్చర్ గా నటిస్తున్నాడు. లక్ష్య అనేది నాగ శౌర్య న‌టించిన‌ 20 వ చిత్రం. ల్యాండ్ మార్క్ మూవీ కోసం అత‌డు క‌ఠోరంగా శ్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పోస్ట‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ఆర్చర్ పాత్రను పోషించడానికి శౌర్య అవ‌స‌రం మేర శారీరక మార్పుల‌కు ప్ర‌య‌త్నించాడు. జిమ్ లో హార్డ్ వ‌ర్క్ చేసి తీరైన రూపానికి మారాడు. ప్రాచీన క్రీడ అయిన‌ విలువిద్య ఆధారంగా ఈ స్పోర్ట్స్ డ్రామా తెర‌కెక్కింది. ఇందులో అతను రెండు విభిన్న గెటప్ లతో అల‌రించ‌నున్నాడు.

ద‌స‌రా కానుక‌గా ల‌క్ష్య కొత్త పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. పార్ధు లాగే చెడును జయించాలని ఆశిస్తున్నాము! అందరికీ #లక్ష్య #దసరా శుభాకాంక్షలు.. అంటూ టీమ్ విషెస్ తెలిపింది. ల‌క్ష్య ఓటీటీలో వ‌స్తోంది అన్న ప్ర‌చారానికి చెక్ పెడుతూ ఇది కేవ‌లం థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతుంది అని టీమ్ పోస్ట‌ర్ లో వెల్ల‌డించిది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ శౌర్య ఫ్యాన్స్ లో వైర‌ల్ అవుతోంది.

జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తుండ‌గా కాల భైర‌వ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన కేతికా శర్మ నటిస్తోంది. SVCLLP తో క‌లిసి శ‌ర‌త్ మ‌రార్-ఏషియ‌న్ సునీల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా నాగ శౌర్య న‌టించిన `వరుడు కావలెను` విడుదలకు సిద్ధంగా ఉంది. వ‌రుడు కావ‌లెను నవంబ‌ర్ లో వ‌స్తుంది. ఇంకా విడుద‌ల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం శౌర్య‌ `ల‌క్ష్య` విడుద‌ల‌ రోజున వ‌స్తున్న సంగ‌తి విధిత‌మే.