#స్పెషల్.. కూతురుతో లక్ష్మీ మంచు యోగాభ్యాసం

Wed Jun 23 2021 18:00:01 GMT+0530 (IST)

Lakshmi Manchu yoga practice with daughter

టాలీవుడ్ లో నటిగా హోస్ట్ గా నిర్మాతగా మంచు లక్ష్మి ఆల్ రౌండర్ షో గురించి తెలిసిందే. మంచు కాంపౌండ్ లోనే మోహన్ బాబు తర్వాత భారీ ఫాలోయింగ్ తో వెలిగిపోతున్న ప్రతిభావని. సోషల్ మీడియాల్లోనూ లక్ష్మీ మంచు కి భారీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టా సహా ఇతర మాధ్యమాల్లో తన కుటుంబానికి సంబంధించిన రకరకాల ఈవెంట్లకు సంబంధించిన ప్రతి ఇన్ఫోని ఫోటోలను షేర్ చేస్తుంటారు.నిన్నటి రోజున మ్యూజికల్ డ్యాన్సింగ్ డే అంటూ లక్ష్మీ మంచు చీరకట్టులో డ్యాన్సులు చేసి దుమారం రేపారు. ఈ వీడియోలో తన కుమార్తె కూడా డ్యాన్సులు చేస్తూ కనిపించారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తన కూతురుతో మంచు లక్ష్మి కొన్ని యోగాసనాలు వేసారు. ఈ ఫోటోలు అంతే వైరల్ అయ్యాయి.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. లక్ష్మి మంచు చివరిసారిగా నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీ డ్రామా `పిట్ట కథలు`లో కనిపించారు. రాముల అనే సెగ్మెంట్లో ఆమె కీలక పాత్ర పోషించారు. దీనికి పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. గత సంవత్సరం ఆమె డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం ఒక ప్రముఖ టాక్ షోను కూడా నిర్వహించింది. `కమ్మింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మి మంచు` అనే సిరీస్ లో తాప్సీ పన్నూ.. అమెరికన్ చిత్రనిర్మాత ఫ్రాంక్ కొరాసి.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. పేస్ట్రీ చెఫ్ పూజా ధింగ్రా తదితరులు పాల్గొన్నారు.