మంచు వారి 'చిట్టి చిలకమ్మ' హ్యాక్

Tue May 11 2021 10:09:00 GMT+0530 (IST)

Lakshmi Manchu YouTube channel hacked

మల్టీ ట్యాలెంటెడ్ మంచు లక్ష్మి యూట్యూబ్ లో ఈమద్య కాలంలో కూతురుతో కలిసి చిట్టి చిలకమ్మ యూట్యూబ్ ఛానెల్ లో పిల్లలకు అవగాహణ కల్పించేందుకు పలు  వీడియోలను చేస్తూ వస్తోంది. చదువుతో పాటు సామాజిక అంశాలను పిల్లలకు ఎలా తల్లిదండ్రులు నేర్పించాలి ఈ తరం పిల్లలతో ఎలా మెలగాలి అనే విషయాలను మంచు లక్ష్మి చెబుతూ మంచి పేరును దక్కించుకుంది. తల్లి కూతుర్లు కలిసి చేసే వీడియోలకు మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి. ఈసమయంలో చిట్టి చిలకమ్మ యూట్యూబ్ ఛానెల్ ను హ్యాక్ చేశారట.తమ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ అయిన విషయాన్ని మంచు లక్ష్మి స్వయంగా చెప్పుకొచ్చారు. గుర్తు తెలియని హ్యాక్స్ తన యూట్యూబ్ ఛానెల్ ను హ్యాక్ చేశారు. ప్రస్తుతం తన టీమ్ ఆ ఛానెల్ ను రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే మళ్లీ మీ ముందుకు చిట్టి చిలకమ్మ ఛానెల్ వస్తుంది అంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. యూట్యూబ్ ఛానెల్స్ ను ఈ మద్య వరుసగా హ్యాక్ చేస్తున్నారు. కొన్ని వారాల క్రితం లాస్య యూట్యూబ్ ఛానెల్ కూడా హ్యాక్ అయిన విషయం తెల్సిందే.

మంచు లక్ష్మి పలు ఆసక్తికర విషయాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా షేర్ చేస్తూ వస్తున్నారు. అలాంటి యూట్యూబ్ ఛానెల్ ను హ్యాక్ చేయడం ఏంటీ అంటూ ఆమె అభిమానులు కొందరు హ్యాక్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఫన్నీగా హ్యాకర్స్ కు థ్యాంక్యూ అంటూ కామెంట్స్ పెట్టారు. నటిగా నిర్మాతగా హోస్ట్ గా ఎన్నో విధాలుగా ప్రేక్షకులకు ఎప్పుడు వినోదాన్ని అందిస్తున్న మంచు లక్ష్మి యూట్యూబ్ ఛానెల్ మళ్లీ అందరి ముందుకు రావాలని మనమూ కోరుకుందాం.