Begin typing your search above and press return to search.

భార్య హృద‌యంలో బంధీగా మారిన భ‌ర్త‌!

By:  Tupaki Desk   |   3 July 2022 9:41 AM GMT
భార్య హృద‌యంలో బంధీగా మారిన భ‌ర్త‌!
X
విగ్నేష్ శివ‌న్-న‌య‌న‌తార సుదీర్ఘ ప్రేమాయ‌ణం త‌ర్వాత !ఇటీవ‌లే వివాహ బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకుని అటుపై ఏమాత్రం ఆలస్యం చేయ‌కుండా హానీమూన్ చెక్కేసారు. కొన్ని రోజుల పాటు ప్ర‌శాంతంగా.. ప్ర‌వ‌సీని కోరుకున్న జంట హానీమూన్ ముగించుకుని చెన్నై కి తిరిగొచ్చారు.

భార్యాభ‌ర్త‌లైన‌ త‌ర్వాత తొలిసారి జంట‌గా ప్లైట్ ఎక్కారు. హ‌నీమూన్ లో ఎన్నో స్వీట్ మెమోరీస్ ఉంటాయి. వాటిని ఒక్కొక్క‌టిగా అభిమానుల‌కు పంచుకోవాలిగా. ఇప్పుడ‌దే ప‌ని లో ప‌డింది ఈ జంట‌. తాజాగా ఈ జంట అన్యోన్యంగా ఉన్న ఓ ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో న‌య‌న‌తార భ‌ర్త‌ని ఎంతో ఘాడంగా కౌగిలించుకుని త‌న హృద‌యంలో బంధీగా మార్చేసింది.

హ‌బ్బీని గ‌ట్టిగా హ‌త్తుకుని త‌న ప్రేమ‌ని చాటుకుంది. ఇలాంటి మూవ్ మెంట్స్ ఈ జంట‌కి కొత్త కాక‌పోవ‌చ్చు. కానీ వివాహానికి ముందు క‌థ వేరేలా ఉంటుంది. పెళ్లి త‌ర్వాత విధానం వేరుగా ఉంటుంది. చూసే జ‌నాల‌కి ఆ జంట మ‌ధ్య అన్యోన్య‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తుందిప్పుడు. త‌ప్పుడు క‌థ‌నాల‌కి ఆస్కారం ఉండ‌దు. అందుకే వివాహం తర్వాత మ‌రోసారి త‌మ మ‌ధ్య అన్యోన్న‌య‌త‌త‌ని ఈ విధంగా చాటే ప్ర‌య‌త్నంలా క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో అభిమానుల్ని ఎంత‌గానో అక‌ట్టుకుంటుంది. న‌య‌న్ కి పాన్ ఇండియా వైడ్ అభిమానులున్నారు. ఇక త‌మిళ‌నాడు లో అయితే ఆమె పేరిట గుడులు..గోపురాలు..అందులో విగ్ర‌హాలు సైతం వెలిసాయి. అలాంటి అభిమానులు న‌య‌న్ ఇప్పుడింత సంతోషంగా ఉండ‌టం చూసి ఆనందంతో ఉబ్బిత‌బ్బితున్నారు.

న‌వ దంప‌తులిద్ద‌రు క‌ల‌కాలం నూరేళ్ల పాటు ఇలాగే సంతోషంతో..ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆశీర్వ‌దిస్తున్నారు. అభిమానుల ఆశీర్వ‌చ‌నాల్ని మించిన దీవెన‌లు ఇంకేముంటాయి. అభిమానుల కోరిక మేర‌కు ఆ దేవుడు కూడా అంతే సంతోషంగా ఉండాల‌ని త‌దాస్తు అంటాడు. ఇక ఈ జంట త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ఎవ‌రి ప‌నుల్లో వాళ్లు బిజీ అవ్వ‌డానికి ఉరెడీ అవుతున్నారు.

కొన్ని నెల‌లుగా పెళ్లి..హానీమూన్ అంటూ స‌మ‌యాన్ని కేటాయించ‌డంతో వృత్తి ప‌రంగా ఎక్క‌డి ప‌నులు అక్క‌డే నిలిచిపోయాయి. ఇప్పుడు వాట‌న్నింటిని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాలి. కొత్త ప్రాజెక్ట్ ల‌కు సంత‌కాలు చేయాలి. అటు ఫ్యామిలీ లైఫ్ ని మిస్ కాకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేసేలా ప్లానింగ్ ఉండాలి. ప్ర‌స్తుతం న‌య‌న‌తార కిట్టీలో అనేక సినిమాలున్నాయి. బాలీవుడ్ న‌టుడు షారుఖ్ ఖాన్ స‌ర‌స‌న `జ‌వాన్` లో న‌టిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో `గాడ్ ఫాదర్`లో న‌టిస్తోంది. ఇంకా కొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి.