Begin typing your search above and press return to search.

LIGER లాస్ యాంజెల్స్ షెడ్యూల్ లో..!

By:  Tupaki Desk   |   28 Nov 2021 5:40 AM GMT
LIGER లాస్ యాంజెల్స్ షెడ్యూల్ లో..!
X
విజయ్ దేవరకొండ - అనన్య పాండే జంటగా న‌టిస్తున్న చిత్రం LIGER. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. చిత్ర యూనిట్ ప్రస్తుతం షూటింగ్ కోసం USA లో ఉంది. మేకర్స్ లాస్ వేగాస్ లో షూటింగ్ ను విజయవంతంగా ముగించారు. స్టార్ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ షెడ్యూల్ లో భాగమయ్యాడు. అతను ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో భాగమైనందుకు సంతోషంగా ఉన్నాడు. షెడ్యూల్ పూర్తయిన వార్తలను అనన్య పాండే ధృవీకరించింది. అన‌న్య వ్యాఖ్యానిస్తూ...``అది మా లాస్ వెగాస్ షెడ్యూల్.. #లైగ‌ర్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది`` అని వెల్ల‌డించింది. అలాగే ఈ షెడ్యూల్ లో లాస్ వేగాస్ లొకేష‌న్ లోనూ చిత్రీక‌ర‌ణ సాగించారు. స్పాట్ నుంచి కొన్ని ఫోటోల‌ను దేవ‌ర‌కొండ - అన‌న్య షేర్ చేశారు.

LIGER బాక్సింగ్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్. ఇందులో విల‌క్ష‌ణ‌మైన ఫైట‌ర్ గా మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ స్పెష‌లిస్టుగా దేవ‌ర‌కొండ క‌నిపించ‌నున్నారు. త‌న పాత్ర కోసం అత‌డు శిక్ష‌ణ పొందాడు. ఈ సినిమాని తెలుగు- హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రం విజయ్ బాలీవుడ్ అరంగేట్ర చిత్రంగా పాపుల‌రైంది. ఇదే మూవీతో సౌత్ లోకి అనన్య పాండే అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమాకి పూరి-ఛార్మి- క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.