అడివి శేష్ సక్సెస్ ట్రాక్.. వరుసగా 5వ హిట్

Sun Jun 26 2022 16:00:17 GMT+0530 (India Standard Time)

Kshanam to MAJOR 5 consecutive hits in a row for Adivi Sesh

మేజర్ సినిమాతో మొత్తానికి కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ చూసిన అడివి శేష్ ఒక మీడియం రేంజ్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు అనే చెప్పాలి. అడివి శేష్ మేజర్ సినిమా వరకు వచ్చిన విధంగా చూసుకుంటే అతనీ ప్రయాణం అంత ఈజీగా ఏమి కొనసాగలేదు. మొదట అతను డైరెక్టర్ కమ్ హీరో గా సొంతంగానే సినిమాలు తీసుకున్నాడు. అయితే దర్శకుడిగా ఊహించని అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ అతను రచయితగా మాత్రం మంచి గుర్తింపు అయితే అందుకున్నాడు.చాలామంది దర్శక నిర్మాతల నుంచి కూడా అతనికి రచయితగా మంచి గుర్తింపు లభించింది. ఇక మళ్ళీ అడవి శేష్ హీరోగానే చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఈ క్రమంలో అతని ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఇతర హీరోల సినిమాల్లో నెగటివ్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా పంజా సినిమా లో అతను చేసిన పాత్ర చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత బలుపు బాహుబలి ఇలా కొన్ని సినిమాల్లో శేష్ చేసిన పాత్రలకు మంచి క్రేజ్ లభించింది.

అయితే హీరోగా అడవి శేష్ చేసిన గత ఐదు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించడం విశేషం. 2016లో క్షణం సినిమాతో అతను చేసిన ప్రయోగం నటుడిగానే కాకుండా రచయితగా కూడా మంచి క్రేజ్ అందించింది. ఆ తర్వాత కామెడీ బ్యాక్ డ్రాప్ లో చేసిన మొదటి సినిమా ఆమీ తూమీ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

డిఫరెంట్ స్పై మూవీ గూడచారి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ అందజేసింది. అనంతరం ఎవరు కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా హిందీలో కూడా ఆ సినిమాను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మేజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 20 కోట్ల వరకు ప్రాఫిట్ అందించినట్లు సమాచారం. ఈ సినిమాకు కూడా అడివి శేష్ రచయితగా వర్క్ చేశాడు.