Begin typing your search above and press return to search.

RRR వ‌సూళ్లు ఫేక్.. నోరు పారేసుకున్న KRK

By:  Tupaki Desk   |   2 April 2022 11:30 PM GMT
RRR వ‌సూళ్లు ఫేక్.. నోరు పారేసుకున్న KRK
X
తెలుగు సినిమా RRR ఇంటా బ‌య‌టా రికార్డుల మోత మోగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. డబ్బింగ్ వెర్షన్ల క‌లెక్ష‌న్లు ఇటీవల ఇంటర్నెట్ లో తుఫానుగా మారాయి. ఇది ఇప్పటికే కొన్ని రోజుల వ్యవధిలో అనేక భాష‌ల్లో రికార్డులను బద్దలు కొట్టింది.. ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా భారీ వ‌సూళ్లు తెచ్చింది. ఇంత‌కుముందే బాలీవుడ్ మీడియాల క‌థ‌నం ప్ర‌కారం ఆర్.ఆర్.ఆర్ 710కోట్లు వ‌సూలు చేసి 1000 కోట్ల క్ల‌బ్ వైపు ప‌రుగులు పెడుతోంద‌ని వెల్ల‌డైంది. అయితే బాక్సాఫీస్ నంబర్లు తప్పు అని సూచించే కొంతమంది ఇంటర్నెట్ వినియోగదారులు లేక‌పోలేదు.

స్వ‌యం ప్రకటిత వివాదాస్ప‌ద‌ విమర్శకుడు కమల్ R ఖాన్ అకా KRK ఈ జాబితాలో టాప్ లో ఉన్నాడు. అతను ఇటీవల ఆర్.ఆర్.ఆర్ బాక్స్ ఆఫీస్ నంబర్లపై తన ఆలోచనలను పంచుకున్నాడు. దీనిని బూటకం అంటూ కొట్టి పారేసాడు. నిజానికి భారీ యాక్షన్-డ్రామా ఆర్.ఆర్.ఆర్ గత నెలల్లో మహమ్మారి కార‌ణంగా ప్రభుత్వాలు విధించిన ఆంక్షల కారణంగా అనేక ఆలస్యాలను ఎదుర్కొంది. ఈ చిత్రం చివరకు ఈ సంవత్సరం మార్చి 25న థియేటర్లలోకి వచ్చింది. అభిమానులు మరియు విమర్శకుల నుండి మంచి సమీక్షలను పొందింది. బాహుబలి ఫేమ్ SS రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ జూనియర్ - రామ్ చరణ్ త‌దిత‌రులు నటులు నటించారు. ఈ చిత్రం లార్జ‌ర్ దేన్ లైఫ్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ర‌క్తి కట్టించింది. న‌టీన‌టుల‌ శక్తివంతమైన ప్రదర్శనలకు గొప్ప పేరొచ్చింది.

ఇటీవలి ట్వీట్ల క్రమంలో KRK త‌న దుగ్ధ‌ను వెల్ల‌గ‌క్కాడు. RRR బాక్స్ ఆఫీస్ నంబర్ లను ప్ర‌స్థావిస్తూ.. ఫేక్ క‌లెక్ష‌న్స్ అన్నాడు. అయితే అతని వాదనలతో నెటిజన్లు పెద్దగా ఏకీభ‌వించ‌లేదు. మొదటి ట్వీట్ లో “ప్రజలు #RRRని పూర్తిగా తిరస్కరించారు.. ఇది పెద్ద వైఫ‌ల్యం. అయితే పెయిడ్ మీడియా ద్వారా ఫేక్ రిపోర్టింగ్ చేయిస్తున్నారు అని మేక‌ర్స్ ఫేక్ హైప్ క్రియేట్ చేస్తున్నారు కనుక ఇది ఇప్పటికే ఫెయిల్యూర్ అని నేను నా తదుపరి సమీక్షలో నిరూపిస్తాను`` అని అన్నాడు. రూ.680 కోట్ల భారీ బడ్జెట్ ను ఎలా లెక్కించాలో ప్రజలకు తెలియదు అని కూడా వ్యాఖ్యానించాడు.