నాగ్ .. చైతూ రియల్ లైఫ్ లోను బంగారాలే!

Wed Jan 19 2022 09:17:33 GMT+0530 (IST)

Kriti Shetty About Bangarraju Movie

నాగార్జున - నాగచైతన్య కాంబినేషన్ లో రూపొందిన 'బంగార్రాజు' సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన బరిలోకి దిగింది. రమ్యకృష్ణ - కృతి శెట్టి కథానాయికలుగా సందడి చేసిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 'బ్లాక్ బస్టర్ మీట్' ను రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ వేదికపై కృతి శెట్టి మాట్లాడుతూ .. "సర్పంచ్ నాగలక్ష్మి నచ్చిందా? 'బంగార్రాజు' అనగానే నాగ్ సార్ అండ్ చై గుర్తుకొస్తారు. నిజంగా రియల్ లైఫ్ లోను వాళ్లిద్దరూ బంగారంలాంటి వ్యక్తులే.నాగ్ సార్ ను కలిసిన వెంటనే ఆయన ఛామ్ .. ఆయన వామ్ .. ఆయన రాయల్ పర్సనాలిటీ గురించి మనకి తెలిసిపోతుంది. ఇక చైతూ విషయానికి వస్తే ఆయన చాలా స్వీట్ హార్ట్. ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం. నేను మంచి సర్పంచ్ ను గనుక కల్యాణ్ కృష్ణ గారికి క్రెడిట్ ఇస్తాను. ఆయన కథ చెబుతున్నప్పుడే నేను చాలా ఎంజాయ్ చేశాను. షూటింగు చేసేటప్పుడు ఫన్ ఎలిమెంట్స్ ఇంకా పెరిగాయి. మీరంతా ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశామని చెబుతుంటే ఇంకా సంతోషంగా ఉంది.

నా పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తోంది .. ఆ క్రెడిట్ కల్యాణ్ గారికి ఇవ్వాలి. ఆయన మామూలు మంచి డైరెక్టర్ కాదు .. చాలా మంచి డైరెక్టర్. అలాగే రమ్యకృష్ణగారు .. ఆమె అద్భుతమైన నటి. ఆమెతో కలిసి నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. రాజమండ్రి నాకు చాలా స్పెషల్ .. ఎందుకంటే షూట్ చేసేటప్పుడు చాలా సమయాన్ని నేను ఇక్కడ గడిపాను. 'ఉప్పెన' సక్సెస్ మీట్ కి కూడా ఇక్కడికి వచ్చాను. అప్పుడు కూడా ఇదే ఎనర్జీతో రిసీవ్ చేసుకున్నారు. మళ్లీ ఇలా చూస్తుంటే చాలా తృప్తిగా ఉంది .. థ్యాంక్యూ" అంటూ ముగించింది.

ఇక కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ .. "నేను ఏ స్టేజ్ మీదైనా ఒకటే మాట చెబుతాను .. నేను ఈ రోజున ఈ స్టేజ్ పై ఉండటానికి కారకులు నాగ్ సార్. అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి అంటే నాగ్ సార్ కి ఎంతో అభిమానం అందుకే 'బ్లాక్ బస్టర్ మీట్' ఇక్కడ పెట్టడం జరిగింది. కృతి శెట్టి చాలా మంచి అమ్మాయి .. చాలా మంచి ఆర్టిస్ట్. ఇక చై విషయానికి వస్తే నిజంగా బంగారమే. ఈ సినిమాతో నాకు బంగారం లాంటి తమ్ముడు దొరికాడు. మరోసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.