Begin typing your search above and press return to search.

ప‌చ్చ‌ల కెంపుల‌తో కృతి జిల్ జిగేల్

By:  Tupaki Desk   |   1 Jun 2021 7:30 AM GMT
ప‌చ్చ‌ల కెంపుల‌తో కృతి జిల్ జిగేల్
X
ప‌చ్చ‌లు కెంపుల‌తో జిల్ జిగేల్మ‌నిపిస్తోంది కృతి సనోన్. చూడ‌గానే త‌ళుకుబెళుకుల షిమ్మ‌రీ గౌన్ లో కృతి అందాలు యువ‌త‌రాన్ని టెంప్ట్ చేస్తున్నాయి. ఆ మెరుపుల్లో సొగ‌స‌రి అందాల‌పై ప‌సుపు రంగు కాంతి విర‌జిమ్మి అంతే మ‌త్తు పెంచుతోంది.

ఇటీవ‌ల కృతి స‌నోన్ సోష‌ల్ మీడియాల్లో జ‌రంత స్పీడ్ గానే ఉంది. వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. త‌ళుకుబెళుకుల డిజైన‌ర్ గౌన్ లో కృతి స‌మ్మోహ‌నం మాయాజాలంలా ప‌ని చేస్తోంది. 1- నేనొక్క‌డినే త‌ర్వాత దోచేయ్ చిత్రంలో న‌టించింది. కానీ విజ‌యం ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత తెలుగు ప‌రిశ్ర‌మ‌ను వ‌దిలి బాలీవుడ్ కే అంకిత‌మైంది.

ప్ర‌స్తుతం మ‌రోసారి టాలీవుడ్ లో క్రేజీ మూవీలో జాక్ పాట్ కొట్టేసింది. ప్ర‌భాస్ స‌ర‌స‌న ఆదిపురుష్ 3డిలో సీత పాత్ర‌లో న‌టిస్తోంది. పాన్ ఇండియ‌న్ స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న ఆఫ‌ర్ ద‌క్క‌గానే కృతి ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యింది. ప్ర‌భాస్ టీమ్ తో కృతి జాయినైంద‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. ఈలోగానే సెకండ్ వేవ్ ప్ర‌భావంతో చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డింది.