ఫొటోటాక్ : బికినీలో 'ఒంగోలుగిత్త' కవ్విస్తోంది

Mon Mar 27 2023 22:00:02 GMT+0530 (India Standard Time)

Photo Talk :Kriti Karbhanda Ravishing In A Bikini

అక్కినేని హీరో సుమంత్ కి జోడీగా 2009 సంవత్సరంలో బోణి అనే సినిమాలో నటించి హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి కర్భంద. మొదటి సినిమా నిరాశ పర్చినా కూడా తెలుగు లో మంచి ఆఫర్లు వచ్చాయి. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. గెస్ట్ రోల్స్ లో కూడా కృతి కర్బంద నటించిన విషయం తెల్సిందే.



పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తీన్మార్ సినిమాలో హీరోయిన్ గా నటించడం తో ఈ అమ్మడి స్థాయి అమాంతం పెరగడం ఖాయం ఆ సమయంలో అంతా అనుకున్నారు.

కానీ పాపం ఈ అమ్మడికి కాలం కలిసి రాలేదు. దాంతో తీన్మార్ తో మంచి సక్సెస్ పడలేదు. దాంతో ఆఫర్లు ఆశించినంతగా రాలేదు.

రామ్ కు జోడీగా ఒంగోలుగిత్త సినిమాలో నటించి మెప్పించిన కృతి కర్బంద ఆ తర్వాత ఇతర భాషల్లో నటిస్తూ తెలుగు లో అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ వస్తుంది.

తెలుగు లో సినిమాలు చేయకున్నా కూడా ఆమె షేర్ చేస్తున్న అందాల ఆరబోత ఫొటోలు ఎప్పటికప్పుడు వైరల్ అయ్యి ఇక్కడ కూడా ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా బికినీలో కృతి కర్బంద సందడి చేసింది. ఈమధ్య కాలంలో కృతిని మరీ ఇంత బోల్డ్ గా చూడలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం కృతి అందాల ఆరబోతకు ఇది పరాకాష్ట అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

తప్పకుండా ఈ అమ్మడు మరో పదేళ్ల పాటు ఇదే జోరు కొనసాగించాలి.. మళ్లీ తెలుగులో వరుస సినిమాలు చేయాలని కొందరు ఆశిస్తూ ఈ ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.