బుల్లెట్ బేబి రైల్వేస్టేషన్ ప్రేమ కహానీ!

Wed Jul 06 2022 15:38:49 GMT+0530 (IST)

Krithi Shetty The Warrior Movie

ముంబై బ్యూటీ కృతిశెట్టి అలియాస్ బేబమ్మ ఫాలోయింగ్  గురించి చెప్పాల్సిన పనిలేదు. బేబమ్మ అలా అమాయకంగా ఓ చూపు చూసినా.. ఓ నవ్వు విసిరినా ఉన్న చోటనే నేలకొరిగిపోవాలి. అంతగా అమ్మడి అందం యువతని కవ్విస్తుంది. ఓ ఇంటర్వ్యూలోఏ కంగా అమాయకంగా ఏడ్చేసి మరి ఫాలోయింగ్ పెంచుకుందంటే? బేబమ్మని అభిమానించని యువత ఉండదా? అన్న సందేహం రాకమానదు.బేబమ్మ ఇప్పుడు  బెల్లెట్ బేబి కూడా అయిన సంగతి తెలిసిందే. 'ది వారియర్' లో బుల్లెట్ సాంగ్ తో అమ్మడి రేంజ్ రెట్టింపు అయింది. యువతలో ఫాలోయింగ్ పీక్స్ కి చేరింది. 'జల జల జలపాతం' అంటూ రొమాంటిక్ సాంగ్ తో ఫీవర్ తెప్పించిన అమ్మడు అటుపై...బుల్లెట్ పాట లో మాస్ హుక్ స్టెప్ తో మరింత క్రేజీ బ్యూటీగా ఫేమస్ అవుతోంది.

లిరికల్ వీడియోతోనే అమ్మడు ఆ రేంజ్లో ఆకట్టుకుందంటే?  రేపు సినిమా రిలీజ్ అయి..హిట్ అయితే కుర్రాళ్ల పరిస్థితిని  అంచనా వేయడం కష్టమే. మరి అందాల బుల్లెట్ బేబి రామ్ తో ఎలా  ప్రేమలో ( సినిమాలో) పడింది?  సినిమాలో రేడియో స్టేషన్ లో ఆర్జేగా నటించిన కృతి - పోలీస్ స్టేషన్ లో  పోలీస్ ఆఫీసర్ రామ్   మధ్య ప్రేమ ఎలా చిగురించిందంటే? మధ్యలో మరో స్టేషన్ రైల్వే స్టేషన్ ఉందంటూ చమత్కరించింది.

బహుశా రైల్వే స్టేషన్ లో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి ఉండొచ్చని నవ్వేసింది. మరి ఆ ప్రేమ గురించి  తెలుసుకోవాలంటే థియేటర్ కి తప్పకుండా వెళ్లాలంటూ చెప్పుకొచ్చింది. సినిమా ప్రేమ కథ సరే. మరి రియల్ లైఫ్ స్టోరీ ఏంటంటే? అలాంటి ఏవీ ఇప్పటివరకూ లేవంటూ  మరోసారి నవ్వేసింది. అలాగే కథల ఎంపికలో తన ప్రత్యేకత గురించి చెప్పుకొచ్చింది.

తాను ఏదైన కథ విన్నదంటే? ఆ పాత్ర నచ్చితే నటించాలనుకుంటే గనుక  ఆ పాత్ర గురించి ముందుగానే నోట్స్ రాసుకుంటుందిట. ప్రేక్షకుల్ని అలరించాల్సిన బాద్యత తనపై ఎంతో ప్రభావం..ఒత్తిడి చూపిస్తాయని అంటోంది. కథ వింటున్నప్పుడే తాను ఎంజాయ్ చేసిందంటే?  ఆ పాత్ర కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని బలంగా నమ్మతుందిట.
 
ఇప్పటివరకూ చేసిన సినిమాలేవి ఫెయిలవ్వలేదని తెలిపింది. అలాగే తన పాత్ర గురించి..సినిమాల గురించి ఇంట్లో కుటుంబ సభ్యులకు తప్పకుండా చెబుతుందిట. ముఖ్యంగా అమ్మ అభిప్రాయాలు కచ్చితంగా తీసుకుంటుందిట. వాళ్లు అనుమతి లేనిదే  కృతి నిర్ణయాలు తీసుకోదిట. ఆ రకంగా కుటుంబానికి బేబమ్మ ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్నది అద్దం అడుతుంది.