వరుస ఫ్లాపులు అప్పుడే బోర్ కొట్టేసిందా?

Thu Aug 18 2022 07:00:01 GMT+0530 (IST)

Krithi Shetty Movie Flops

ప్రతీ శుక్రవారం జాతకాలు మారిపోయే రంగుల ప్రపంచం సినిమా. ఇక్కడ సక్సెస్ కె విలువ ఎక్కువ. అది వుంటేనే ఎవరికైనా క్రేజ్ వన్స్ అది చేయి జారిందా?  ఇక్కడ పట్టించుకునే వారే వుండరు. డిమాండ్ అండ్ సప్లై సూత్రంపై సినిమా రంగం నడుస్తోంది. సినీ మేకర్స్ కూడా ఇదే ఫాలో అవుతూ వుంటారు. 'ఉప్పెన' సినిమాతో ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న బేబమ్మ ఇప్పడు బెంబేలెత్తిపోతోంది.సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు డైరెక్షన్ లో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన మూవీ 'ఉప్పెన'. ఇదే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కృతిశెట్టి తొలి మూవీతో భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. వంద కోట్ల క్లబ్ లో చేరడంతో పరిశ్రమ వర్గాల దృష్టి బేబమ్మపై పడింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫీర్లని దక్కించుకోవడం మొదలు పెట్టింది. క్రేజీ హీరోల సినిమాలలో అవకాశాల్ని సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.

నేచురల్ స్టార్ నానితో కలిసి నటించిన 'శ్యామ్ సింగరాయ్'లో లిప్ లాక్ లకు కూడా రెడీ అయియిన ఈ అమ్మడు ని చూసి ఫ్యాన్స్ అంతా టాలీవుడ్ కు సౌందర్యలా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని ప్రశంసలు కురిపించారు.

నాగచైతన్యతో చేసిన 'బంగార్రాజు' ఫరవాలేదనిపించినా ఆ తరువాత చేసిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులుగా మారి బేబమ్మకు షాకిచ్చాయి. రామ్ హీరోగా నటించిన 'ది వారియర్' జూలైలో విడుదలై ఫ్లాప్ అనిపించుకుంది.

ఇక ఆగస్టు 12న విడుదలైన నితిన్ మూవీ 'మాచర్ల నియోజక వర్గం'కూడా అదే బాట పట్టింది. ఈ వరుస ఫ్లాపులకు తోడు కృతి రొటీన్ ఎక్స్ ప్రెషన్ కూడా బెడిసి కొడుతోందట. దీంతో బేబమ్మ ఎక్స్ ప్రెషన్స్ ఫ్యాన్స్ కి అప్పుడే బోర్ కొట్టేస్తున్నాయా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే కృతిశెట్టి నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సెప్టెంబర్ 16న విడుదలకు సిద్ధమవుతోంది.

సరిగ్గా మూవీ రిలీజ్ నెలరోజులుంది. అప్పుడే మేకర్స్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేశారు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సుధీర్ బాబు హీరోగా నటించారు. వరుస ఫ్లాపులతో అప్ సెట్ అయిన కృతి మాత్రం తనకు టైమ్ కావాలంటోందట. ఇప్పట్లో ప్రమోషన్స్ ని తాను స్టార్ట్ చేయలేనని స్పష్టం చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.