తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది

Tue Oct 04 2022 09:23:59 GMT+0530 (India Standard Time)

Krithi Shetty Movie Career

'ఉప్పెన' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసింది కృతి శెట్టి. ఈ కన్నడ భామకు యువతరంలో అసాధారణ ఫాలోయింగ్ ఏర్పడింది. అదే క్రమంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచిన చందంగా అయ్యింది. ఉప్పెన తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్టు లేదు.ఇప్పటికే పలు సినిమాలు చేసినా వరుస ఫ్లాప్ లను చవిచూసింది. నితిన్ తో మాచర్ల నియోజకవర్గం.. రామ్ తో వారియర్ పెద్ద ఫ్లాపులయ్యాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా ఫ్లాప్ ల జాబితాలో నిలవడంతో కృతి తీవ్రంగా నిరాశపడింది. అయినా మూడు ఫ్లాప్ లు వచ్చినా కృతికి ఇప్పటికీ డిమాండ్ ఉంది. కానీ ఇటీవల కృతి సినిమాలకు సైన్ చేయడానికి తొందరపడటం లేదని తెలిసింది. వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నప్పటికీ ఏదో ఒకటి సంతకం చేయడానికి తొందరపడటం లేదు. స్క్రిప్ట్ ను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. కొన్నిటిని ఇప్పటికే సున్నితంగా తిరస్కరించింది.

మంచి స్క్రిప్టు.. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లేకపోతే కథానాయికలు ఎంతగా ప్రయత్నించినా వైఫల్యాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే తన పునరాగమన చిత్రంతో హిట్టు కొట్టి మంచి ప్రభావం చూపేలా చూసుకోవాలని కృతి కోరుకుంటోంది. తదుపరి నాగచైతన్య సరసన వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించనుంది. ఇతర సినిమాల వివరాలు వెల్లడించాల్సి ఉంది.

పాన్ ఇండియా ఆఫర్ వచ్చినా కానీ...!

నిజానికి కెరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే అసాధారణ స్టార్ డమ్ ని అందుకున్న నాయికలు కొందరున్నారు. ఇటీవలి కాలంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన ఈ కేటగిరీకి చెందుతుంది. ఆ తర్వాత  తెలుగు సినీసర్కిల్స్ లో ప్రముఖంగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి మోస్ట్ లక్కీయెస్ట్ గాళ్! అంటూ ప్రశంసలు అందుకుంది. కానీ ఎందుకనో ఈ భామకు లక్ కలిసి రాలేదు.

పాన్ ఇండియా కేటగిరీలో వారియర్ లాంటి పాన్ ఇండియా సినిమా తనకే దక్కడం లక్కీ అని చెప్పాలి.  కెరీర్ ఆరంభమే లింగుస్వామి లాంటి ప్రతిభావంతుడి నిర్ధేశనంలో కృతి పాన్ ఇండియా నాయికగా పరిచయమైంది. ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని సరసన కృతి శెట్టి ఆఫర్ తనకు బిగ్ జాక్ పాట్ అని భావించారు. కానీ ఈ చిత్రం బిగ్ ఫ్లాప్ గా నిలిచి కృతిని అయోమయంలో పడేసింది. అందుకే ఇప్పుడు స్క్రిప్టుల పరంగా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోందని సమాచారం.

దోష నివారణ పూజలు ...!

వరుస ఫ్లాపులతో బెంబేలెత్తిన కృతి అప్పట్లో దోష నివారణ పూజలు చేయించిందని ప్రచారమైంది. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'పై ఈ భామ చాలా ఆశలు పెట్టుకుంది. అంతకుముందు కొన్ని వరుస పరాజయాలతో కంగారు పడిన కృతి దోష నివారణ పూజలు చేయించిందని ఓ పుకార్ షికార్ చేసింది. ఒక బంపర్ హిట్ కొట్టి కెరీర్ ని తిరిగి ట్రాక్ లో కి తేవాలని ప్రయత్నించింది. కానీ ఆశించినది దక్కలేదు. కానీ యంగ్ బ్యూటీకి ఇంకా నిరూపించుకునేందుకు అవకాశాలొస్తున్నాయి. మునుముందు బంపర్ హిట్లు కొట్టి రేస్ లో దూసుకొస్తుందనే ఆశిద్దాం.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.