అథ్లెట్ జీవితకథలో నటిస్తే బావుండేది కృష్ణా!

Sun Jul 25 2021 21:24:27 GMT+0530 (IST)

Krishna it would be good to see an athlete in his life story

జాకీ ష్రాప్ కుమార్తె .. టైగర్ ష్రాప్ సోదరి కృష్ణా ష్రాప్ సోషల్ మీడియా వరల్డ్ కి అత్యంత ఆప్తురాలు.. వయసు 28 ఏళ్లు వచ్చినా ఇంకా బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోలేదు. నటనకు తాను దూరం అని ఇంతకుముందు చెప్పిన ఈ బ్యూటీ ఇటీవల మనసు మార్చుకుంటున్నట్టే కనిపిస్తోంది. ఇటీవలే `కిన్ని కిన్ని వారీ ` అనే ఓ వీడియో సాంగ్ తో పరిచయం అయింది. కానీ ఆ వీడియోసాంగ్ అంతగా రీచ్ కాలేదు. కానీ కృష్ణా హాట్ హాట్ ఎక్స్ ఫోజింగ్ ఎలివేషన్స్ లో ఎంత చురుగ్గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాల్లో కృష్ణ దూకుడు ఎంతమాత్రం తగ్గలేదు.ఇక బోయ్ ఫ్రెండ్ ఎబాన్స్ కి బ్రేకప్ చెప్పాక మరింతగా రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు టూపీసు ల్లో.. బీచ్ ఒడ్డున బీకినిల్లో చెలరేగుతూనే ఉంటుంది. ఇక కవర్ పేజీలో కోసం అమ్మడి అందాల ఆరబోత యూత్ లో ఎప్పుడూ హాట్ టాపిక్.

టోన్డ్ బాడీ చురుకైన చూపులతో చూపరులను కట్టిపడేయడం డాటరాఫ్ జాకీకి అలవాటు. తాజాగా హెచ్ అండ్ హెచ్ మ్యాగజైన్ కోసం మరోసారి చెలరేగిపోయింది. బ్లాక్ కలర్ ఇన్నర్ ధరించి అథ్లెటిక్ ఫోజుతో హీట్ పెంచింది. ఆయిలీ టోన్డ్ చర్మ సౌందర్యంతో తళతళలాడుతోంది. ఫిట్ నెస్ విషయంలో వర్కౌట్స్ కోసం ఎంతగా శ్రమిస్తుందో కృష్ణా శరీరాకృతి చెబుతోంది. యాబ్ మడతలను థై సొగసును కృష్ణ ఎంతమాత్రం దాచుకునేందుకు ఆసక్తి గా లేదని అర్థమవుతోంది. కిల్లర్ లుక్స్ తో కృష్ణ చూపరులను ఇట్టే ఆకట్టుకుంది ఈ బ్యూటీ. మొత్తంగా బ్లాక్ అండ్ బ్లాక్ లో రీబూట్ అయ్యేలా చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. బ్రదర్ టైగర్ ష్రాఫ్ లానే చెల్లెలు కృష్ణా ష్రాప్ డెడికేటెడ్ గాళ్! అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అమ్మడి కిల్లర్ లుక్స్ పై యూత్ లో కామెంట్లు గురించి చెప్పాల్సిన పనిలేదు. మరీ ఆ రేంజులో అథ్లెటైజర్ కదా.. ఎవరైనా అథ్లెట్ జీవితకథలో నటిస్తే క్రేజు వేరేగా ఉంటుంది కదా? అని అడిగేస్తున్నారు కొందరైతే. ఇక కృష్ణాష్రాప్ చేసిన లేటెస్ట్ వీడియో సాంగ్ లో అమె స్నేహితులు కూడా నటించారు. ఓ మహిళ గురించి చెప్పే సాంగ్ లో జన్నత్ జుబైర్- నగ్మా మిరాజ్కర్- జామీ లివర్- రాజ్ షోకర్- తన్వి గీతా రవిశంకర్ ఆ పాటలో కనిపిస్తారు.